అన్వేషించండి

T20 World Cup Semifinal: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ రద్దు అయితే సెమీఫైనల్స్ చేరేది ఎవరు ?

IND vs WI Semi-final Equation: వర్షం కారణంగా భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ రద్దైతే, నెట్ రన్ రేట్ కీలకం కానుంది. ఏ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుందో టీమిండియా ఫ్యాన్స్‌కు తెలిసిందే.

టి20 వరల్డ్ కప్ 2026: భారత్ వర్సెస్ వెస్టిండీస్ - సెమీఫైనల్ రేసులో నిలిచేది ఎవరు?

కోల్‌కతా: టి20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఈరోజు (మార్చి 1) రాత్రి కీలక పోరు  జరగనుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు ఇంటి దారి పట్టాల్సిందే. అయితే కోల్‌కతాలో వర్షం పడినా, లేక ఏదైనా కారణంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యంకాక రద్దు చేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే, సెమీఫైనల్‌కు ఏ జట్టు వెళ్తుందో ఇక్కడ తెలుసుకుందాం. 

వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?
గ్రూప్-1లో ఉన్న టీమిండియా, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే చెరో 2 మ్యాచ్‌లు ఆడాయి. రెండింటికీ ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. ఓ మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ ఓడి సమానంగా ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. దీనివల్ల విండీస్, భారత్ జట్ల పాయింట్లు 3-3 కి చేరుతాయి.

పాయింట్లు సమానమైనప్పుడు సెమీఫైనల్ బెర్త్ ఎవరికి దక్కుతుందనే నిర్ణయం నెట్ రన్‌రేట్ ఆధారంగా డిసైడ్ చేస్తారు.  ప్రస్తుతం నెట్ రన్‌రేట్ విషయంలో వెస్టిండీస్ జట్టు ముందంజలో ఉంది. కనుక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే వెస్టిండీస్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకే నేడు కచ్చితంగా మ్యాచ్ జరిగి, సూర్యకుమార్ సేన విజయం సాధించాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

భారత్ వర్సెస్ వెస్టిండీస్ - హెడ్ టు హెడ్ రికార్డులు
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటివరకు 30 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 19 విజయాలతో ఆధిక్యంలో ఉండగా, వెస్టిండీస్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. అయితే టీ20 వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. మొత్తం నాలుగు మ్యాచులలో భారత్, విండీస్ జట్లు తలపడగా 3 సార్లు కరేబియన్ జట్టు నెగ్గా, టీమిండియా ఓ మ్యాచులో విజయం సాధించింది.

సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి
సూపర్-8 దశలో భారత్, వెస్టిండీస్ రెండు జట్లు కూడా దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలయ్యాయి. అయితే జింబాబ్వేపై మాత్రం 2 జట్లు విజయం సాధించాయి. ఇప్పటివరకూ సమ ఉజ్జీలుగా ఉన్న జట్లు నేటి రాత్రి సెమీఫైనల్స్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు నెగ్గుతుందా అని భారత్, విండీస్ ఫ్యాన్స్ హై వోల్టేట్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget