WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. సీజన్ ప్రారంభం కాకముందే హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ సంచలనం సృష్టిస్తోంది. గత సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.
కప్ ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది ముంబై ఇండియన్స్ టీమ్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ముంబై.. మెగా వేలంతోనే ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చింది.వేలంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కేర్‌ను దక్కించుకుంది ముంబై ఇండియన్స్. తన రాకతో మిడిల్ ఆర్డర్‌లో మంచి పట్టు వచ్చింది.
డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభానికి ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. "గత మూడేళ్లలో మేము రెండు టైటిళ్లు గెలిచినప్పుడు ఎలాంటి మైండ్‌సెట్‌తో ఉన్నామో, ఇప్పుడు కూడా అదే ఆలోచనతో వెళ్తున్నాం. మంచి క్రికెట్ ఆడటమే మా ప్రధాన లక్ష్యం" అని హర్మన్ అన్నారు. టైటిల్ గెలవడానికి సాధ్యమైనదంతా చేస్తామని పేర్కొన్నారు.





















