అన్వేషించండి

కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్

MLAs Disqualification | కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా క్లీన్ ఎలా ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు.

హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి (దానం నాగేందర్)కి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును నిస్సిగ్గుగా అవమానించడమేనని కేటీఆర్ మండిపడ్డారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజు అని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా వాడుకోవడానికి ఇది ఒక నిదర్శనమని ఆయన ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటుంటే, దానికి స్పీకర్ తన ముద్ర వేయడం వల్ల ప్రజాస్వామ్య విలువలకే ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్

ఇలాంటి నిర్ణయాలు వ్యవస్థలపై ప్రజలకున్న విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వారికి సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తన నిరసనను వ్యక్తం చేశారు.

స్పీకర్ తీర్పును స్వాగతించిన కడియం..
తెలంగాణ స్పీకర్ తీర్పును ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. తమపై వేసిన పిటిషన్లు చట్టబద్దం కావని, పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి.. కానీ నాకు బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. పార్టీ పరంగా బీఆర్ఎస్ ఎందుకు పిటిషన్ వేయలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు. మేం 38 మంది సభ్యులం, దాని ప్రకారం సమయం కావాలని అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు అడిగిన విషయాన్ని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ఎల్పీకి ప్రతినెల మా జీతం నుంచి రూ.5 జమ అవుతుండటం నిజం అయినప్పుడు... మేం బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాం అనేది వాస్తవం అన్నారు. పార్టీ అధినాయకత్వానికి దూరంగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజల కోసం మేం పని చేస్తున్నాం అన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు.. ? పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి మరీ ఆ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా చేశారని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ నా నుంచి వివరణ కోరలేదు

పార్టీ మారారని తనపై ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నుంచి తనను ఇప్పటివరకూ ఎవరూ వివరణ కోరలేదని దానం నాగేందర్ అన్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం తనను ఆహ్వానించకపోవడాన్ని తప్పుపట్టారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదన్నారు. వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని, వాటికి అనుగుణంగా నడుచుకున్నట్లు పేర్కొన్నారు.

మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ 
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణనలు ఎదుర్కొంటున్న అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ ల పిటిషన్లు విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు దశలవారీగా వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా బుధవారం (మార్చి 11న) కడియం శ్రీహరి, దానం నాగేందర్ ల అనర్హత పిటిషన్లు కొట్టివేయడంతో అందరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు అయింది. కానీ ఇది ప్రజస్వామ్యంపై జరిగిన దాడిగా కేటీఆర్ అభివర్ణించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget