అన్వేషించండి

Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?

Kavitha : జాగృతి పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్న కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో రాజకీయ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ కంటే వేగంగా ఆమె క్షేత్రస్థాయి సమస్యలపై స్పందిస్తూ, ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.

Kavitha aggression in ground politics goes beyond BRS:    తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అనూహ్య మార్పు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నేతలు ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కొంత తడబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాము ఇంకా సమర్థవంతమైన ప్రతిపక్షంగా మారలేకపోతున్నాం అని గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అయితే, సరిగ్గా ఇక్కడే  కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో రాజకీయ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ కంటే వేగంగా ఆమె క్షేత్రస్థాయి సమస్యలపై స్పందిస్తూ, ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.

వెలుగుమట్ల  బాధితుల కోసం అనూహ్య ఉద్యమం 

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్ల కూల్చివేతపై కవిత చేసిన పోరాటం రాజకీయ వర్గాల్లో  ఆసక్తికర చర్చకు కారణం ్వుతోంది.  నిరాశ్రయులైన కుటుంబాల కోసం ఆమె ఏకంగా ఖమ్మం నడిబొడ్డున  ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, పోలీసుల నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీఆర్ఎస్ కేడర్ అంతా స్తబ్దుగా ఉన్న తరుణంలో, ఆమె నేరుగా గ్రౌండ్ లెవల్‌లోకి వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వడం ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో ఆమెపై సానుభూతి ,  మద్దతు పెరుగడానికి కారణం అయింది. 

లిక్కర్ కేసు నుంచి విముక్తి 

ఇటీవలే ఢిల్లీ లిక్కర్ కేసు నుండి విముక్తి పొందిన కవిత తెలంగాణ జాగృతి  వేదికగా తన రాజకీయ పునరాగమనాన్ని అత్యంత శక్తివంతంగా చాటుకుంటున్నారు. తనను  పార్టీ నుండి పంపేశారని చెబుతున్న ఆమె  చేస్తున్న పోరాటాలు చూస్తుంటే.. బీఆర్ఎస్ చేయలేని పనిని ఆమె ఒంటిచేత్తో చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ వంటి అగ్రనేతలు ఇంకా వ్యూహాల్లో నిమగ్నమై ఉండగా, కవిత మాత్రం నేరుగా  యాక్షన్ లోకి దిగడం  బీఆర్ఎస్‌కు షాక్ లాంటిదే.  కవిత ఇప్పుడు తన 'తెలంగాణ ఉద్యమ కాలం' నాటి పంథాను మళ్లీ ఎంచుకున్నారు. అప్పట్లో జాగృతి ద్వారా ఎలాగైతే ప్రజలను సమీకరించారో, ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో వెళ్తున్నారు.  చట్టసభల్లో గొంతుక కంటే.. వీధుల్లో చేసే పోరాటమే బలంగా వినిపిస్తుంది అనే సిద్ధాంతాన్ని ఆమె పాటిస్తున్నారు.  

బీఆర్ఎస్ లీడర్, క్యాడర్ జాగృతి వైపు ఆకర్షితులవుతారా? 

జగదీష్ రెడ్డి చెప్పినట్లుగా పార్టీ ఇంకా ప్రతిపక్ష పాత్రకు అలవాటు పడకపోవచ్చు కానీ, కవిత మాత్రం ఇప్పటికే ఆ పాత్రలో ఒదిగిపోయారు. ప్రజా సమస్యలపై ఆమె చూపిస్తున్న ఈ తెగువ, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆమెకు ప్రజల మద్దతును మరింత పెంచుతున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ కేడర్ కూడా ఆమె నాయకత్వం వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని  చెబుతున్నారు. కేటీఆర్ కూడా వెంటనే..  ప్రెస్మీట్లు, సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కాకుడా..  ప్రత్యక్షంగా రాజకీయ యుద్ధాలకు దిగాలన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్ లో వినిపిస్తోంది.                             

టాప్ హెడ్ లైన్స్

AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP TDP Janasena Social Media War: ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?
ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget