అన్వేషించండి

రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి

Hyundai Creta Discount Sale: జులైలో క్రెటా విక్రయాలు చాలా బాగున్నప్పటికీ ఆగస్టులో ఆఫర్ వచ్చింది. జులైలో హ్యుందాయ్ 18,088 యూనిట్లను డెలివరీ చేసింది. రూ.1 లక్ష బెనిఫిట్ ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గత నెలలో భారీ అమ్మకాల తర్వాత ఈ ఆఫర్లు వచ్చాయి.

మీరు ఆగస్టు 2026లో హ్యుందాయ్ క్రెటా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు మంచి వార్త కావచ్చు. ఈ నెలలో క్రెటా యొక్క కొన్ని పెట్రోల్ మరియు క్రెటా ఎన్ లైన్ (Creta N Line) వేరియంట్లపై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ప్రతి క్రెటా మోడల్‌పై పూర్తి రూ.1 లక్ష ప్రయోజనం లభించదని మీరు తెలుసుకోవడం ముఖ్యం. వేరియంట్, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్, ఎక్స్ఛేంజ్ మరియు స్క్రాపేజ్ వంటి షరతుల ఆధారంగా ఈ ఆఫర్లు మారుతుంటాయి.

హ్యుందాయ్ క్రెటాపై ఎంత బెనిఫిట్ లభిస్తోంది?
ఆగస్టులో క్రెటాకు చెందిన కొన్ని ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్లు, క్రెటా ఎన్ లైన్‌లపై రూ.1 లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చు.మరోవైపు, పెట్రోల్ IVT వేరియంట్‌పై ఈ ప్రయోజనం రూ.90 వేల వరకు లభిస్తుంది. బేస్ E పెట్రోల్ వేరియంట్‌పై రూ.85 వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రెటా డీజిల్ వేరియంట్‌పై ఆఫర్ తక్కువగా ఉంది. ఇందులో కేవలం రూ.10 వేల వరకు మాత్రమే ప్రయోజనం అందిస్తున్నారు. 


రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి

రూ.1 లక్ష డిస్కౌంట్ అనేది నేరుగా కారు ధర నుండి తగ్గే క్యాష్ డిస్కౌంట్ కాదు. ఇందులో క్యాష్ లేదా కస్టమర్ బెనిఫిట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఇన్సెంటివ్, కొన్ని అదనపు బోనస్‌లు ఉన్నాయి. మీకు ఎంత ప్రయోజనం లభిస్తుందనేది మీరు ఎంచుకునే వేరియంట్, సిటీ, డీలర్ వద్ద ఉన్న స్టాక్, పాత కారు ఎక్స్ఛేంజ్ పై ఆధారపడి ఉంటుంది. కనుక కారు కొనుగోలు చేయడానికి ముందు డీలర్ నుండి ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి.

Also Read: Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో

క్రెటాలోని చాలా పెట్రోల్ వేరియంట్లు (ప్రత్యేకించి IVT మినహా), క్రెటా ఎన్ లైన్‌పై రూ.1 లక్ష వరకు బెనిఫిట్ లభిస్తోంది. క్రెటా నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్లతో వస్తుంది. దీనిని మాన్యువల్, IVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కొనవచ్చు. క్రెటా ఎన్ లైన్‌లో 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వస్తుంది. దీనితో మాన్యువల్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది.

డీజిల్ క్రెటాపై ఆఫర్ ఎంత
డీజిల్ క్రెటా కొనుగోలు చేయాలనుకుంటే ఆఫర్ చాలా తక్కువ ఇస్తున్నారు. డీజిల్ వేరియంట్‌పై రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. అంటే ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్‌పై రూ.1 లక్ష ప్రయోజనానికి, డీజిల్ మోడల్ ఆఫర్‌కు మధ్య రూ.90 వేల వరకు వ్యత్యాసం ఉంది. ఎక్కువగా ప్రయాణించే కస్టమర్లకు మెరుగైన మైలేజ్, ఎక్కువ లో-ఎండ్ టార్క్‌ల కారణంగా డీజిల్ వెర్షన్ ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్. 

హ్యుందాయ్ క్రెటా, క్రెటా ఎన్ లైన్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.10.91 లక్షల నుండి రూ.19.95 లక్షల వరకు ఉంటుంది. ఆగస్టు ఆఫర్‌ను నేరుగా ఈ ధర తగ్గింపు అనుకోవద్దు. ఆ ప్రయోజనం అనేది కస్టమర్, డీలర్ షరతులను బట్టి మారవచ్చు. కొనుగోలు చేయడానికి ముందు స్టాక్,  కారు తయారీ నెలను (మ్యానుఫాక్చరింగ్ మంత్) చెక్ చేయడం కూడా ముఖ్యం.

జులైలో క్రెటా అమ్మకాలు చాలా బాగానే ఉన్న సమయంలో ఈ ఆఫర్ ఇచ్చారు. జులై 2026లో హ్యుందాయ్ 18,088 క్రెటా యూనిట్లను డెలివరీ చేసింది. ఇది ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక నెలవారీ సేల్స్. జూన్ నెలలో ఈ సంఖ్య కేవలం 7,168 యూనిట్లు.  జూన్‌లో సప్లయర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఉత్పత్తి తగ్గింది. ఆ తర్వాత జులైలో ఉత్పత్తి, అమ్మకాలు రెంటిలోనూ రికవరీ కనిపించింది.

Also Read: నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?

కొనుగోలు చేయడం మంచిదేనా..

ఆగస్టులో క్రెటా కొనుగోలు చేసేవారికి పెట్రోల్ వేరియంట్‌పై లభించే ఆఫర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. అయితే రూ.1 లక్ష ప్రయోజనాన్ని చూసి బుక్ చేసుకునే ముందు, మీ విషయంలో ఇందులో ఎంత క్యాష్ బెనిఫిట్, ఎంత ఎక్స్ఛేంజ్/ స్క్రాపేజ్ బెనిఫిట్, ఇతర బోనస్‌లు లభిస్తాయో తెలుసుకోవడం ముఖ్యం.

ఇక డీజిల్ క్రెటాపై కేవలం రూ.10 వేలు ఆఫర్ లభిస్తోంది. కనుక పెట్రోల్, డీజిల్ మధ్య నిర్ణయం తీసుకునేటప్పుడు ధర, మైలేజ్, మీ డ్రైవింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. 

Frequently Asked Questions

నాకు ఎంత ప్రయోజనం లభిస్తుందో ఏ అంశాలు నిర్ణయిస్తాయి?

మీరు ఎంచుకునే వేరియంట్, సిటీ, డీలర్ వద్ద ఉన్న స్టాక్, పాత కారు ఎక్స్ఛేంజ్ వంటి షరతుల ఆధారంగా ఆఫర్లు మారుతాయి. పూర్తి వివరాల కోసం డీలర్‌ను సంప్రదించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
పెట్రోల్‌తో 24.77km, సీఎన్‌జీతో 34.47km.. 2026 టయోటా గ్లాంజా మైలేజీకి ఫిదా అవ్వాల్సిందే!
టయోటా గ్లాంజా, మారుతి బలెనో, హ్యుందాయ్‌ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌ - ఏ కారు మైలేజ్‌ ఎక్కువ?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
Embed widget