అన్వేషించండి

Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 

Colombia Earthquake:కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు 15వందల వరకు నివాసాలు ధ్వంసం కాగా, వందమందికిపైగా పౌరులు మృతి చెందారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొలంబియాలో 7.4 తీవ్రత భూకంపం; 111 మంది మరణం, 87 గాయాలు.
  • కొలంబియాలో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి; సహాయక చర్యలు ముమ్మరం.
  • ప్రభావిత పిల్లల కోసం శిబిరాలు, అధ్యక్షుడు నష్టాన్ని అంచనా వేశారు.

Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటివరకు 111 మంది మరణించగా, 87 మంది గాయపడినట్లు సమాచారం. ఈ భూకంపం వల్ల 1,575 ఇళ్లు దెబ్బతినగా, డజన్ల కొద్దీ ఇతర ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 61 భవనాలు కూడా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారని వార్తలు వస్తున్నాయి. పశ్చిమ కొలంబియాలోని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అక్కడ రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నాయి.

సహాయక చర్యలు ముమ్మరం

కొలంబియాలో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన మరుసటి రోజు, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పశ్చిమ కొలంబియాలోని కాలి, క్విబ్డో, పెరీరా, చుట్టుపక్కల ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

భూకంపం కారణంగా దాదాపు 1,600 భవనాలు దెబ్బతిన్నాయని లేదా కూలిపోయాయని సమాచారం. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సోమవారం మధ్యాహ్నం నాటికి కనీసం 111 మంది మరణించారు. అనేక కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయిన ప్రియమైన వారి కోసం వెతుకుతున్నాయి. గల్లంతైన వారి గురించిన సమాచారాన్ని పంచుకోవడానికి పౌరులు ఆన్‌లైన్ వేదికలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

పిల్లల కోసం శిబిరాలు 

సహాయక సంస్థలు ముఖ్యంగా పిల్లలకు సహాయం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లల కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వరల్డ్ విజన్ కొలంబియా కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ బార్బరా మెలో తెలిపారు.

తల్లిదండ్రులను కోల్పోయిన లేదా వారిని సంప్రదించలేని పిల్లల కోసం ఈ శిబిరాలు పని చేస్తాయి. కష్ట సమయాల్లో పిల్లలు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఇక్కడ క్రీడలు, ఇతర కార్యకలాపాలను కూడా అందిస్తాయి.

భూకంప కేంద్రమైన చోకోలో అనేక సవాళ్లు

కొలంబియాలోని అత్యంత పేద, వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పే చోకో ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది. ఈ ప్రాంతం చాలా కాలంగా సాయుధ బృందాల తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీని వల్ల కూడా ఇక్కడి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువతకు మరిన్ని ఇబ్బందులు కలుగజేసింది.  

సహాయక సంస్థల ప్రకారం, ఆ ప్రాంతంలోని భౌగోళిక స్వరూపం కూడా సహాయక చర్యలను సవాలుగా మారుస్తోంది. అనేక ప్రాంతాలకు పడవ లేదా విమానం ద్వారా మాత్రమే చేరుకోగలరు. అందుకే సహాయక బృందాలు బాధితుల వద్దకు చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది.  

నష్టంపై అధ్యక్షుడి అంచనాలు 

కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా, భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, సహాయక, రెస్క్యూ కార్యకలాపాల స్టాటస్‌ గురించి ఆరా తీయడానికి సోమవారం రాత్రి ఆ ప్రాంత రాజధాని అయిన క్విబ్డోకు చేరుకున్నారు.

2026లో అత్యంత శక్తివంతమైన భూకంపాలు

2026లో ఇప్పటివరకు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో 7.0 కంటే ఎక్కువ తీవ్రత గల శక్తివంతమైన భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో, వెనిజులా, కొలంబియాలో అత్యంత విధ్వంసకరమైన భూకంపాలు సంభవించినట్లు రికార్డు అయ్యింది. 

కొలంబియా (7.4 తీవ్రత)

ఆగస్టు 10న, చోకోలోని శాన్ జోస్ డెల్ పాల్మార్‌లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. పెరీరాతో సహా పలు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు.

వెనిజులా (7.5, 7.2 తీవ్రత)

జూన్ 24న, వెనిజులాలో 39 సెకన్ల వ్యవధిలో 7.5, 7.2 తీవ్రత గల రెండు ప్రధాన భూకంపాలు సంభవించాయి.

ఫిలిప్పీన్స్ (7.7 నుంచి 7.8 తీవ్రత)

జూన్ 8న ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో 7.7 నుంచి 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరిక జారీ చేశారు. 

టోంగా (7.5 తీవ్రత)

మార్చి 24న టోంగాలోని వవావు సమీపంలో సముద్రంలో 7.5 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదు.

ఇండోనేషియా (7.4 తీవ్రత)

ఏప్రిల్ 1న ఇండోనేషియాలోని ఉత్తర మలుకు ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

జపాన్ (తీవ్రత 7.4)

ఏప్రిల్ 20న, జపాన్‌లోని ఇవాటే, మియాకో సముద్ర ప్రాంతానికి సమీపంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

మెక్సికో (తీవ్రత 7.3)

జూలై 17న, మెక్సికోలోని చియాపాస్ తీరానికి దూరంగా 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు మెక్సికో సిటీ నుంచి ఎల్ సాల్వడార్ వరకు ఎఫెక్ట్ అయ్యాయి.

వనౌటు (తీవ్రత 7.3)

మార్చి 30న, వనౌటులోని సాన్మా ప్రాంతంలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.

Frequently Asked Questions

కొలంబియా భూకంపం వల్ల ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారు?

కొలంబియాలో సంభవించిన 7.4 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 111 మంది మరణించారు. 87 మంది గాయపడినట్లు సమాచారం.

కొలంబియా భూకంపం కారణంగా ఎంత ఆస్తి నష్టం జరిగింది?

ఈ భూకంపం వల్ల 1,575 ఇళ్లు దెబ్బతిన్నాయి. డజన్ల కొద్దీ ఇతర ఇళ్లు పూర్తిగా ధ్వంసమవ్వగా, 61 భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.

కొలంబియా భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి?

పశ్చిమ కొలంబియాలోని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నాయి. వరల్డ్ విజన్ కొలంబియా వంటి సంస్థలు పిల్లల కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి.

భూకంప కేంద్రమైన చోకో ప్రాంతంలో సహాయక చర్యలకు ఎదురైన సవాళ్లు ఏమిటి?

చోకో పేద, వెనుకబడిన ప్రాంతం కావడం, సాయుధ బృందాల కార్యకలాపాలు, అలాగే భౌగోళిక స్వరూపం సహాయక చర్యలను సవాలుగా మార్చింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
United States IRAN War: 'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget