అన్వేషించండి

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !

Fake Rapido Driver | చార్మినార్ దగ్గర నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చి ర్యాపిడో డ్రైవర్‌గా నమ్మించబోయిన వ్యక్తిని సిద్ధి అనే మహిళ అప్రమత్తతతో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్ మహిళ సిద్ధి అప్రమత్తతతో నకిలీ రాపిడో డ్రైవర్‌ను నిలదీసింది.
  • అతనికి ఐడీ, బైక్ నంబర్ ప్లేట్, యాప్ లేకపోవడం గమనించింది.
  • బైక్ స్టార్ట్ కాకపోయినా రైడ్ ఇస్తాననడం మోసం అని హెచ్చరించింది.
  • ఈ ఘటన మహిళల భద్రతకు, అప్రమత్తతకు ఒక హెచ్చరిక.

హైదరాబాద్‌లో ఒక మహిళ అప్రమత్తతతో వ్యవహరించి, రాపిడో డ్రైవర్‌గా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని నిలదీసింది. సిద్ధి అనే మహిళ చలి కారణంగా కుర్తీ, షాల్ ధరించి బయటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాపిడో డ్రైవర్‌గా చెప్పిన వ్యక్తి బైక్ నెంబర్ ప్లేట్ పై నెంబర్ కూడా లేదని, అతడి ఫోన్లో యాప్ లేకుండానే అతడు ప్యాసింజర్లను రైడ్ కోసం పిలిచి మోసం చేస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో సిద్ది అనే మహిళ ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఒక వ్యక్తి వచ్చి తాను రాపిడో డ్రైవర్ అని, తన బైక్‌పై డ్రాప్ చేయమంటారా అని ఆమెను అడిగాడు. అయితే, ఆ వ్యక్తి వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో సిద్ధి వెంటనే అతడిని ఐడీ కార్డు చూపమని డిమాండ్ చేసింది. తాను తన యాప్ ద్వారా ఎటువంటి రైడ్‌ బుక్ చేసుకోలేదని, అలాంటప్పుడు తన దగ్గరకు వచ్చి ఎలా అడుగుతారని ఆమె ప్రశ్నించింది. అంతేకాకుండా, అతని బైక్‌కు కనీసం నంబర్ ప్లేట్ కూడా లేకపోవడాన్ని ఆమె గమనించి, అసలు రాపిడో ఎలా నడుపుతున్నావని గట్టిగా నిలదీసింది.

ఆ వ్యక్తి తన పేరు ఇర్ఫాన్ అని చెప్పినప్పటికీ, తన రాపిడో ఐడీ చూపించలేకపోయాడు.  విచిత్రమేమిటంటే, ఆ వ్యక్తి బైక్ స్టార్ట్ కావడం లేదని ఆ మహిళ వీడియోలో చూపించింది. కానీ అతను మాత్రం ప్రయాణికులను డ్రాప్ చేస్తానని ఆఫర్లు ఇస్తున్నాడు. సిద్ధి అతడిని గట్టిగా మందలిస్తూ, ఇలాంటి మోసాలకు పాల్పడవద్దని హెచ్చరించింది. "నీ బండి స్టార్ట్ కావడం లేదు, కానీ నన్ను డ్రాప్ చేస్తానంటావా? సిగ్గుండాలి" అంటూ అతడిని అక్కడి నుండి పంపించివేసింది. మహిళల భద్రత దృష్ట్యా గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ఇలాంటి ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Also Read: Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి 

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !

మీరు కూడా బైక్ క్యాబ్స్ బుక్ చేసుకుని జర్నీ చేస్తున్నారా.. అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి. ఆ మహిళ తరహాలో మీరు అప్రమత్తంగా వ్యవహరిచాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతడి మాట నమ్మి యాప్ ద్వారా బుకింగ్ జరగకుండా బైక్ ఎక్కితే ఆమె పరిస్థితి ఎలా ఉండేదోనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Frequently Asked Questions

రాపిడో డ్రైవర్‌గా నటిస్తూ మోసాలకు పాల్పడిన వ్యక్తిని ఎవరు నిలదీశారు?

హైదరాబాద్‌లో సిద్ధి అనే మహిళ రాపిడో డ్రైవర్‌గా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని నిలదీసింది. బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడం, యాప్ లేకపోవడంతో ఆమె అప్రమత్తమైంది.

రాపిడో డ్రైవర్‌గా చెప్పుకున్న వ్యక్తిలో సిద్ధి ఏమి గమనించింది?

ఆ వ్యక్తి బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడం, అతని ఫోన్‌లో రాపిడో యాప్ లేకపోవడం, తన బైక్ స్టార్ట్ కాకపోయినా రైడ్ ఆఫర్ చేయడం సిద్ధి గమనించింది. అతను ఐడీ చూపించలేకపోయాడు.

ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది?

ఈ ఘటన హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. సిద్ధి ఆటో కోసం ఎదురుచూస్తుండగా ఈ వ్యక్తి తారసపడ్డాడు.

ఈ ఘటన ద్వారా ప్రజలకు ఇవ్వబడిన హెచ్చరిక ఏమిటి?

గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ఇలాంటి ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా మహిళల భద్రత దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget