అన్వేషించండి

Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!

Jharkhand Students Protest:జార్ఖండ్‌ నియామక పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయని విద్యార్థి లోకం తిరగబడింది. జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్ష రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జార్ఖండ్‌లో విద్యార్థులు జేఎస్‌ఎస్‌సీ పరీక్షా అక్రమాలపై అసెంబ్లీ మార్చ్‌ చేశారు.
  • ప్రభుత్వం కమిటీ వేసినా, భారీ భద్రతతో విద్యార్థులను మార్గమధ్యలో అడ్డుకుంది.
  • నిరాహార దీక్షలో ఉన్న విద్యార్థి నాయకుడు అంబులెన్స్‌లో అసెంబ్లీకి యత్నించాడు.
  • పరీక్ష రద్దు, సీబీఐ విచారణ కీలకం, విద్యార్థులు రాజీపడలేదు.

Jharkhand Students Protest:జార్ఖండ్‌ రాజధాని రాంచీ వీధులు విద్యార్థుల నినాదాలతో హోరెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నియామక పరీక్షల్లో, ముఖ్యంగా జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు అసెంబ్లీ మార్చ్‌కు పిలుపునిచ్చాయి. గడిచిన రెండు వాలుగా శాంతియుతంగా సాగుతున్న ఈ నిరసన నేడు ఉద్రిక్తంగా మారింది. 

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాంచీలోని పాత అసెంబ్లీ గేటు వద్దు చేరుకోవడం ప్రారంభించారు. పాత అసెంబ్లీ నుంచి కొత్త అసెంబ్లీ భవనం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. తాము విద్యావంతులమని శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తామని విద్యార్థి నాయుకులు చెప్పారు. ఇందు కోసం వందల మంది వాలంటీర్లు కూడా పని చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ప్రభుత్వం ఒక కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. 

మరోవైపు శాంతియుత నిరసన అని విద్యార్థులు చెబుతున్నప్పటికీ అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కొత్త అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ 750 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్‌ సెక్షన్ 163 విధించారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు. నలుగురు ఐపీఎస్ అధికారులు, పది మంది డీఎస్పీలు, 24 మంది ఇన్‌స్పెక్టర్లు, సుమారు 700 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. నిఘా కోసం డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలను వాడుతున్నారు. పాత అసెంబ్లీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ మందిర్ చౌక్ వద్దే విద్యార్థులను నిలువరించారు. దీని కోసం భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

అంబులెన్స్‌లోనే అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో

ఈ నిరసనలో అత్యంత చర్చనీయాంశమైనది విద్యార్థి నాయకుడు దేవంద్ర మహతో పోరాటం. గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహతో ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. అధికారులు కళ్లు గప్పి అంబులెన్స్‌లో అసెంబ్లీ వైపు కదిలిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంబులెన్స్‌లో ప్రయాణించిన ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి జార్ఖండ్‌ ఉద్యమకారుడు దివంగత శిబు సోరెన్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని, తప్పుడు హామీలతో కాలాన్ని వెళ్లదీస్తోందని ఆయన ఆరోపించారు. 

విద్యార్థుల డిమాండ్ ప్రకారం జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్ష రద్దు చేయాలి. ఈ పరీక్షా నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు వాదిస్తున్నారు. 

అభయ్ తివారీ అనే వ్యక్తి తాను 400 మంది అభ్యర్థులను ఎంపిక చేయించానని బహిరంగంగానే అంగీకరించారని గుర్తు చేశారు. ఇంతటి బహిరంగంగా అక్రమాలు జరిగే ప్రభుత్వం మౌనంగా ఉండటం విద్యార్థుల ఆగ్రహానికి కారణం అవుతోంది. 

విద్యార్థుల డిమాండ్‌లలో 98 శాతం నెరవేర్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మిగిలిన 2 శాతం చాలా కీలకమని అంటున్నారు. ఆ రెండు శాతంలోనే సీబీఐ విచారణ, పరీక్ష రద్దు వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. అందుకే ఒక్క శాతం కూడా రాజీ పడటం లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. 

ఈ ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే ఈ ఉద్యమం పిల్లల భవిష్యత్‌కు సంబంధించిందని పార్టీలకు సంబంధం లేదని చెబుతున్నారు. 

 

Frequently Asked Questions

రాంచీలో విద్యార్థుల నిరసనలకు ప్రధాన కారణం ఏమిటి?

జార్ఖండ్ ప్రభుత్వ నియామక పరీక్షల్లో, ముఖ్యంగా జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

విద్యార్థులు జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరీక్షా నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వాదిస్తున్నారు.

నిరసనలపై ప్రభుత్వ స్పందన ఏమిటి?

ప్రభుత్వం ఒక కమిటీని వేస్తున్నట్లు ప్రకటించింది, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. అలాగే, భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించింది.

దేవేంద్ర మహతో ఎవరు? ఈ నిరసనలో అతని పాత్ర ఏమిటి?

దేవేంద్ర మహతో ఒక విద్యార్థి నాయకుడు, తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించినా, అంబులెన్స్‌లో అసెంబ్లీ వైపు కదిలిన ఆయన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
Embed widget