మంచి సిబిల్ స్కోర్‌ను చూపించి బ్యాంక్‌ను అభ్యర్థించడం ద్వారా వడ్డీ రేటు తగ్గించుకునే అవకాశం ఉంది. బ్యాంక్ స్వల్ప స్విచింగ్ లేదా ప్రాసెసింగ్ ఫీజుతో కొంత మినహాయింపు ఇవ్వగలదు.
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Home Loan Repayment: మీరు ఇల్లు కొంటున్నట్లయితే హోమ్ లోన్ తీసుకోవాల్సి వస్తే.. ఈఎమ్‌ఐ (EMI) కీలకం కానుంది. వడ్డీ రేటు తగ్గించుకోవడంతో పాటు అధికమొత్తం చెల్లిస్తే వడ్డీ తగ్గుతుంది.

- వడ్డీ రేటు తగ్గించుకోవడానికి బ్యాంకును కోరండి లేదా బదిలీ చేయండి.
- బోనస్‌తో పాక్షిక ముందస్తు చెల్లింపులు చేయండి, వడ్డీ తగ్గించుకోండి.
- ఈఎమ్‌ఐ భారం తగ్గించుకోడానికి లోన్ వ్యవధిని పెంచుకోండి.
- ఆరు నెలలు ఈఎమ్‌ఐ కట్టకపోతే ఎన్‌పీఏ, సిబిల్ దెబ్బతింటుంది.
Home Loan Repayment: సొంత ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే అది మనదై ఉండాలి అనే కోరికతోనే ఎంత కష్టమైనా సరే తమ కలను సాకారం చేసుకుంటుంటారు. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా Home Loan తీసుకుని మరీ తమ డ్రీమ్ హౌస్ కల నేరవేర్చుకుంటారు. అందుకే ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని మన పెద్దలు ఊరకే అనలేదు.మీరు కూడా ఇల్లు కొనడానికి హోం లోన్ తీసుకుంటుంటే, ఈ వార్త మీకు ఎంతో ఉపయోగపడుతుంది. లోన్ తీసుకున్నాక నెలవారీ EMI భారంలో కుంగిపోకముందే, మీ డబ్బును ఎలా ఆదా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
వడ్డీ రేటు తగ్గించుకోవాలి
మీరు మీ బ్యాంక్‌ను అభ్యర్థించడం ద్వారా, మీ మంచి సిబిల్ (CIBIL) స్కోర్‌ను చూపించడం ద్వారా వడ్డీ రేటును తగ్గించుకునే వీలుంటుంది. బ్యాంక్ కూడా స్వల్ప స్విచింగ్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజును సర్దుబాటు చేసి మీకు కొంతమేర మినహాయింపు ఇవ్వవచ్చు.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం
ఒకవేళ బ్యాంక్ మీ అభ్యర్థనను అంగీకరించకపోతే, వేరొక బ్యాంక్‌లో వడ్డీ రేటు తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే, మీరు మీ లోన్ ఆ రెండో బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనివల్ల లాంగ్ టర్మ్‌లో మీ డబ్బు కొంతమేర ఆదా అవుతుంది.
పాక్షిక ముందస్తు చెల్లింపు
డబ్బు ఆదా చేయడానికి అత్యంత ఉత్తమమైన మార్గం వడ్డీ మనీని ఆదా చేయడం. మీకు ఏవైనా బోనస్ లేదా ఇన్సెంటివ్‌లు వచ్చినప్పుడు.. లేదా కొంతమేర నగదు చేతికి వచ్చిన సందర్భంలో ఆ మనీతో లోన్ ఓ వాయిదా చెల్లించండి. లేకపోతే లోన్ అమౌంట్ కు నేరుగా పేమెంట్ చేయండి. దీనివల్ల మీ వడ్డీ భారం తగ్గుతుంది.
ఒత్తిడి తగ్గాలంటే.. వ్యవధిని పెంచుకోండి
ఎక్కువ EMI వల్ల మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడుతుంటే, మీరు మీ ఈఎమ్‌ఐని తగ్గించుకుని, లోన్ టెన్యూర్ పెంచుకోవచ్చు. దీనివల్ల మీ నెలవారీ వాయిదా తగ్గి మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. లోన్ చెల్లించకుండా ఆర్థికంగా ఇబ్బంది పడేందుకు బదులుగా ఈఎంఐ విలువ తగ్గించుకోవడమే సరైన నిర్ణయం.
6 నెలల వరకు లోన్ చెల్లించకపోతే ఏమవుతుంది?
6 నెలల వరకు హోం లోన్ EMI చెల్లించకపోతే మీ లోన్ ఖాతా ఎన్‌పీఏ (NPA)గా ప్రకటిస్తారు. బ్యాంక్ మీపై జరిమానా, పెనాల్టీ వడ్డీని సైతం విధిస్తుంది. అదే జరిగితే కనుక అత్యంతక కీలకమైన మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) కూడా బాగా తగ్గిపోతుంది. దీంతో పాటు బ్యాంక్ రికవరీ లేదా చట్టపరమైన చర్యల బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుంది.
Frequently Asked Questions
హోం లోన్ వడ్డీ రేటును ఎలా తగ్గించుకోవచ్చు?
హోం లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎప్పుడు చేయాలి?
మీ బ్యాంక్ అభ్యర్థనను అంగీకరించకపోతే, తక్కువ వడ్డీ రేటుతో వేరొక బ్యాంక్ లభిస్తే, లోన్‌ను అక్కడకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది దీర్ఘకాలంలో డబ్బు ఆదా చేస్తుంది.
హోం లోన్ వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి మార్గం ఏమిటి?
బోనస్ లేదా ఇన్సెంటివ్‌లు వచ్చినప్పుడు ఆ డబ్బుతో లోన్‌కు పాక్షికంగా చెల్లింపు చేయవచ్చు. దీనివల్ల మీ వడ్డీ భారం తగ్గి, డబ్బు ఆదా అవుతుంది.
EMI భారాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి?
ఎక్కువ EMI వల్ల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడుతుంటే, EMIని తగ్గించుకుని లోన్ టెన్యూర్ పెంచుకోవచ్చు. ఇది మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
హోం లోన్ EMI ఆరు నెలలు చెల్లించకపోతే ఏమవుతుంది?
ఆరు నెలల వరకు EMI చెల్లించకపోతే, లోన్ ఖాతా NPAగా మారుతుంది. బ్యాంక్ జరిమానా, పెనాల్టీ వడ్డీ విధిస్తుంది, సిబిల్ స్కోర్ తగ్గి, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















