మీ ఆదాయపు పన్ను రిటర్న్ సరైనదని తేలితే, రీఫండ్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది

Image Source: ABP Live

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం ITR ప్రాసెస్ అయిన తర్వాత 4 నుండి 5 వారాలలోపు ట్యాక్స్ రిటర్న్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు

Image Source: ABP Live

రీఫండ్ పొందడానికి మీ బ్యాంక్ ఖాతా ఆదాయపు పన్ను పోర్టల్‌లో ముందే వెరిఫై అయి ఉండాలి. PANతో లింక్ చేసి ఉండాలి

Image Source: ABP Live

ITR ఫైల్ చేసిన తర్వాత మీరు రిటర్న్ ను ఈ-వెరిఫై చేయకపోతే రిఫండ్ ప్రక్రియలో ఆలస్యం అవుతుంది

Image Source: ABP Live

ITR లో ఇచ్చిన సమాచారం, AIS Form 26AS లేదా TDS వివరాలలో తేడా ఉంటే రీఫండ్ నిలిచిపోతుంది

Image Source: ABP Live

మీ పత్రాలన్నీ సరిగ్గా ఉండి అదనపు తనిఖీ అవసరం లేకపోతే రీఫండ్ త్వరగా వస్తుంది

Image Source: ABP Live

ట్యాక్స్ పేయర్ ఆదాయపు పన్ను ఈఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ చేయడం ద్వారా దాఖలు చేసిన రిటర్న్స్ లేదా రీఫండ్ స్టేటస్ చూడవచ్చు

Image Source: ABP Live

PAN పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ ఖాతా నంబర్ లో ఏదైనా పొరపాటు వల్ల రీఫండ్ ఆలస్యం కావచ్చు

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

నిర్ణీత సమయం తర్వాత కూడా రీఫండ్ రాకపోతే పోర్టల్‌లో స్టేటస్ చెక్ చేయండి. అవసరమైతే బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయండి

Image Source: ABP Live

రిఫండ్ లో సమస్య వస్తే ట్యాక్స్ పేయర్ ఆదాయపు పన్ను శాఖ హెల్ప్ డెస్క్ ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు

Image Source: ABP Live