అన్వేషించండి

Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం

Kavuri Sambasivarao Is No More | గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు.

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ఆయన మృతిపై సోషల్ మీడియాలో, కొన్ని ప్రధాన మీడియాలో కథనాలు రాగా, కుటుంబసభ్యులు వాటిని ఖండించారు. అయితే పరిస్థితి విషమించడంతో డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం రాత్రి కావూరి కన్నుమూశారు.

రాజకీయ ప్రస్థానం
కావూరి సాంబశివరావు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గం నుండి 1984, 1989, 1998 లోక్ సభ ఎన్నికల్లో,   ఏలూరు నియోజకవర్గం నుండి 2004, 2009లో గెలుపొందారు. కావూరి 8, 9, 12, 14, 15 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ఎంపీగా సేవలు అందించారు. యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 

రాష్ట్ర విభజన అనంతరం కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం టీడీపీతో సన్నిహితంగా వ్యవహరించిన ఆయన తరువాత బీజేపీలో చేరారు. ఆయన మృతి పట్ల ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కావూరి సాంబశివరాలు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.


Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం

సీఎం చంద్రబాబు సంతాపం

‘సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని’ ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. 

విచారం వ్యక్తం చేసిన ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్
విజయవాడ: మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాదవ్ విచారం వ్యక్తం చేశారు. 5 సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా కావూరి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. రాజకీయంలో వారికున్న సుదీర్ఘ అనుభవంతో.. ప్రజాసమస్యలపై పార్లమెంటులోనూ, బయటా తన గళాన్ని వినిపించిన నేత. కావూరి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బలమైన సమైఖ్యాంధ్ర వాదిగా గుర్తింపు..

సమైక్యాంధ్రకు బలమైన మద్దతుదారుడిగా కావూరి గుర్తింపు పొందారు. 2013-14లో తెలంగాణ ఏర్పాటు సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని సమైఖ్యాంధ్ర కోసం గట్టిగా తన వాదన వినిపించిన నేతల్లో కావూరి ఒకరి. తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే కనుక మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు (కానీ తర్వాత అలాగే కొనసాగారు). ఉమ్మడిగానే రాష్ట్రాన్ని ఉంచాలని, ముక్కలు చేయడం ద్వారా ఓ ప్రాంతానికి నష్టం జరుగుతుందని గళం విప్పారు. కావూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థిరమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆరోగ్య కారణాల వల్ల ఇటీవలి కాలంలో వీల్‌చైర్‌లో కనిపించారు. 

పారిశ్రామికవేత్తగా..
రాజకీయాల్లోకి రాకముందు కావూరి సాంబశివరావు ఇంజనీరింగ్ పట్టా పూర్తి చేసి పారిశ్రామికవేత్తగా రాణించారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ (PCL) సంస్థను స్థాపించి మౌలిక సదుపాయాల రంగంలో కీలక ప్రాజెక్టులు చేపట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget