అన్వేషించండి

Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !

Annadata Sukhibhav : పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు పదమూడో తేదీన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. చంద్రబాబు గన్నవరంలో జరిగే కార్యక్రమంలో రైతులతో మాట్లాడతారు.

Ugadi gift to AP farmers:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతన్నలకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది.  అన్నదాత సుఖీభవ  పథకం నిధులను, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నిధులతో కలిపి ఈ నెల 13వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో   46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తారు.

ఈ విడతలో భాగంగా అర్హులైన ప్రతి రైతు ఖాతాలో  రూ. 6,000 జమ కానున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద అందించే రూ. 2,000 ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా అన్నదాత సుఖీభవ కింద రూ. 4,000 అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విడత కోసం మొత్తం రూ. 2,808 కోట్లను కేటాయించింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ ఆర్థిక సాయం రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది.  

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏటా  రూ. 20,000 అన్నదాత సుఖీభవ కింద జమ చేస్తున్నారు. ఇందులో  రాష్ట్రం రూ. 14,000 , కేంద్రం రూ. 6,000 పెట్టుబడి సాయం  ఇస్తున్నాయి.  ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ. 14,000 చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇప్పుడు అందజేయబోయే మూడో విడత రూ. 6,000తో కలిపి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తి చేసినట్లవుతుంది.

కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటి నుంచి పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుండగా, అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం ఇప్పటికే ఈ-కేవైసీ  ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైతులు తమ ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ సొమ్మును పొందుతారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raghurama on Amaravati: అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
AP high Court: ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
YSRCP supports Delimitation Bill: పునర్విభజన బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశం వదులుకున్న జగన్
పునర్విభజన బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశం వదులుకున్న జగన్
Stand up comedian arrest: ఉప ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు - స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్
ఉప ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు - స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్
Advertisement

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS LSG Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. నాలుగో విజ‌యంతో స‌త్తా.. ఆకట్టుకున్న కోహ్లీ, భువీ, .. ల‌క్నో చిత్తు
టాప్ లేపిన ఆర్సీబీ.. నాలుగో విజ‌యంతో స‌త్తా.. ఆకట్టుకున్న కోహ్లీ, భువీ, .. ల‌క్నో చిత్తు
Delimitation Bill 2026: డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
Raghurama on Amaravati: అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
Ration shops: రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
AP high Court: ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
TDP Son Rise: మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
Peddi Postponed: జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Embed widget