Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
భారత క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. అది ఏంటంటే వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిట్ అని ప్రకటించింది బీసీసీఐ. మరికొద్ది రోజులో ప్రారంభం కానున్న భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆడబోతున్నారు. టీమ్ ను ప్రకటించినప్పుడు శ్రేయస్ అయ్యర్ ఆడటం అతని ఫిట్‌నెస్ ఆధారంగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది బీసీసీఐ.
న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శ్రేయాస్ ట్రైనింగ్ పూర్తయింది. భారత జట్టులోకి తిరిగి రాకముందు శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచ్‌లు ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్‌కు గాయమైంది. ఇప్పుడు చికిత్స తర్వాత అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో శ్రేయాస్ పునరాగమనం చేశాడు. ముంబై తరపున ఆడుతూ అయ్యర్ 82 పరుగులు చేశాడు. అయ్యర్‌ను ముంబై జట్టుకు కెప్టెన్‌గా నియమించారు.





















