BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నందున..సెన్సిటివ్ ఇష్యూ దృష్ట్యా ముస్తాఫిజుర్ ను తమ టీమ్ నుంచి తొలగిస్తూ KKR తీసుకున్న నిర్ణయం..ఎటెటో వెళ్లిపోతోంది. ఆఖరకు బంగ్లా దేశ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు సంక్షోభంలో పడింది. ముస్తాఫిజుర్ ను తొలగించటాన్ని అవమానంగా భావించి బంగ్లా క్రికెట్ బోర్డు తొలుత మేం జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఆడమని మొండికేసింది. ఆ తర్వాత భారత్ లో ఆడమని వేరే ఏదైనా తటస్ఠ వేదిక కల్పించాలని మారాం చేసింది. ఇవేవీ వర్క్ అవుట్ కాకపోవటంపై వాళ్ల మీద వాళ్లే ఇప్పుడు చేసుకుంటున్న విమర్శలు బోర్డు సంక్షోభానికి కారణమవుతున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ అయిన నజ్ముల్ ఇస్లాం..బంగ్లా క్రికెటర్స్ మైండ్ సెట్ పై మండిపడ్డాడు. భారత్ తో మ్యాచ్ లు ఆడకపోయినా..వరల్డ్ కప్ ఆడకపోయినా బోర్డు కు ఏం నష్టం ఉండదన్న నజ్ముల్..నష్టపోయేది క్రికెటర్లే అంటూ హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా బంగ్లా క్రికెటర్లు చాలా విదేశీ లీగుల్లో ఆడుతున్నారని..ఎక్కడా వాళ్లు తమకు దక్కుతున్న కోట్లాది రూపాయలకు న్యాయం చేసేలా ఆడట్లేదని..సో ఆయా క్రికెట్ లీగ్స్ ఫ్రాంచైజీలు బంగ్లా ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే వాళ్ల నుంచి డబ్బులు తిరిగి లాక్కోవాలని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది బంగ్లా ఆటగాళ్ల ఆగ్రహానికి కారణమైంది. ఇస్లాంను తక్షణమే బోర్డ్ నుంచి తొలగించాలని కోరుతూ నిన్న జరగాల్సిన బంగ్లాదేశ్ ప్రీమయర్ లీగ్ రెండు మ్యాచ్ లను ఆటగాళ్లు బాయ్ కాట్ చేశారు. ఫలితంగా వివాదం మరింత దూరం వెళ్లకుండా బోర్డ్ డైరెక్టర్ నే బోర్డ్ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో..అసలు బంగ్లాదేశ్ వరల్డ్ కప్ ఆడుతుందో..లేదా తప్పుకుంటుందో చూడాలి.





















