అన్వేషించండి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం

Chiranjeevi New Porject : మెగాస్టార్ చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన భవిష్యత్ ప్రణాళిక వివరించారు.

Chiranjeevi Plans Free Education To Poor Kids : మెగాస్టార్ చిరంజీవి... కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా మరో కొత్త సేవా కార్యక్రమం కోసం ప్లాన్ చేస్తున్నారు. 

కోలీవుడ్ స్టార్ సూర్య స్ఫూర్తితో...

ఉగాది పండుగ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మెగాస్టార్... భవిష్యత్తులో నిరుపేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. 'తమిళనాడులో హీరో సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని అగరం ఫౌండేషన్ స్థాపించినట్లు ఎన్నోసార్లు చెప్పారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉచిత విద్య అందించారు. ఇలా ఆయన చేస్తున్న విద్యా దానం నన్ను మోటివేట్ చేసింది. ఒకప్పుడు ఆయన నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు.

కానీ ఇప్పుడు నేను ఆయన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నా. నిరుపేద చిన్నారులకు ఉచిత విద్య అందించడమే నా భవిష్యత్ ప్రణాళిక. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందితే ఆ కుటుంబమే బాగుపడుతుంది. ఆ దిశగా ఆలోచన చేస్తున్నా. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి ఆనాడు బ్లడ్ బ్యాంక్ స్థాపించా. అక్కడితో ఆగిపోకుండా ఇంకా సేవ చేయాలనుంది. ఇప్పుడు విద్యను అందిచడమే లక్ష్యంగా పెట్టుకున్నా.' అని చెప్పారు.

Also Read : ఓటీటీలోకి సుప్రీత హారర్ థ్రిల్లర్ అమరావతికి అహ్వానం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఫ్యాన్స్  ప్రశంసలు

చిరంజీవి నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ముందుంటారని... పేద పిల్లలకు ఉచిత విద్య అందించడం ద్వారా మరింత మందికి ఉన్నత విద్య చేరువవుతుందని అంటున్నారు. ఆయన ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Pre Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Shakeela Warning : షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
Sukriti Veni : ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget