అన్వేషించండి

Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?

Irumudi Trailer Review : మాస్ మహారాజ రవితేజ ఇరుముడి ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. మూడు లేయర్స్ చిక్కుముడి ఈ సినిమా స్టోరీ అని తెలిపారు డైరెక్టర్ శివ నిర్వాణ.

Ravi Teja's Irumudi Trailer Trending Story Plot Revealed : మాస్ మహారాజ రవితేజ, శివ నిర్వాణ కాంబోలో రాబోతోన్న ఫ్యామిలీ క్రైమ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇరుముడి (Irumudi). ఇప్పటివరకూ రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ ఒక ఎత్తైతే గురువారం రిలీజ్ చేసిన ట్రైలర్ మరో ఎత్తు.

మొదట్లో ఈ మూవీని అయ్యప్ప స్వామి కథ అంటూ ప్రచారం సాగినా... గ్లింప్స్‌తోనే అది నిజం కాదని తేలిపోయింది. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ను చూపిస్తూనే సరికొత్త క్రైమ్ కథాంశంతో కథను అల్లుకుంటూ వెళ్లారు డైరెక్టర్ శివ నిర్వాణ. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ మూవీ స్టోరీ గురించి రివీల్ చేశారు.

'మూడు ముడుల చిక్కుముడి'

ట్రైలర్‌లో ఉన్న దానికి పదిరెట్లు సినిమా ఉంటుందని చెప్పారు శివ నిర్వాణ. 'ఇది భక్తి సినిమా అని ప్రచారం చేశారు. ఫస్ట్ లుక్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో ఓ డివోషనల్ వైబ్రేషన్ వచ్చింది. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. ట్రైలర్‌తో క్లారిటీ ఇద్దామని వెయిట్ చేశా. ఈ కథలో మూడు లేయర్స్ ఉంటాయి. ఇద్దరి మధ్యలో పడిన ముడి.

ఓ ఫాదర్ డాటర్‌కు మధ్య ఒక ముడి. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తునికి మధ్యలో ఇరుముడి. ఈ సినిమాలో ఉన్న క్రైమ్ చిక్కుముడి. ఈ మూడు లేయర్స్ కలిపి నేను ఇరుముడి అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ఇది రీమేక్ కాదు. ఓ ఫ్యామిలీ డ్రామాలో ఇంత ఇంటెన్సిటీ గతంలో మీరు చూసి ఉండరు. థియేటర్లలో మీరు అది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. క్రైమ్ లేయర్‌లో మీరు భయంతో అలర్ట్‌గా సినిమాను చూసేలా చేస్తుంది.' అని తెలిపారు.

Also Read : Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ

ట్రైలర్ ఎలా ఉందంటే?

భార్య, కూతురు ప్రాణంగా బతికే ఓ మధ్య తరగతి తండ్రి చుట్టూ 'ఇరుముడి' స్టోరీ సాగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. కూతురి కోసం మద్యం మానేయాలని అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు తండ్రి. ఆ 41 రోజులు అతని జీవితంలో జరిగే సంఘర్షణలు ఫ్యామిలీ, కూతురి కోసం తండ్రి చేసే పోరాటం ఇరుముడి. ఊరిలో జరిగే అమ్మాయిల మిస్టీరియస్ మరణాలు, విద్యా వ్యవస్థలో లోపాలను కూడా టచ్ చేస్తూ ఓ సరికొత్త ఇంటెన్స్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను చూపించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

మరి ఆ ఊరిలో అమ్మాయిల మిస్టీరియస్ మరణాల వెనకు ఉన్నది ఎవరు? హీరో దీక్ష తీసుకునే టైంలో ఏం జరిగింది? ఊరిలో అమ్మాయిలను కాపాడేందుకు హీరో ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. 

ఈ మూవీలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. రవితేజ కూతురి పాత్రలో చిన్నారి నక్షత్ర నటించారు. అలాగే, అజయ్ ఘోష్, సాయి కుమార్ కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఆగస్ట్ 21న తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది.

Also Read : Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
October Third Week OTT Movies : అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget