తెలుగు కాదు... ఇతర భాషల్లో చిరంజీవి చేసిన సినిమాలేవో తెల్సా?

చిరంజీవి, జయప్రద నటించిన '47 రోజులు' గుర్తుందా? అది బైలింగ్వల్. ఆ మూవీ తమిళ్ టైటిల్ '47 నాట్కల్'.

సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ్ మూవీ 'రాణువ వీరన్'లో దొంగ పాత్రలో చిరు నటించారు.

'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'ను తమిళంలో 'మాపిళ్ళై'గా రజనీ రీమేక్ చేయగా... చిరు అతిథి పాత్ర చేశారు.

రాజశేఖర్ 'అంకుశం'ను హిందీలో 'ప్రతిబంద్' పేరుతో రీమేక్ చేశారు చిరు. ఆయన బాలీవుడ్ డెబ్యూ ఇది.

'ప్రతిబంద్' తర్వాత చిరు చేసిన హిందీ సినిమా 'ఆజ్ కా గూండారాజ్'. తెలుగు హిట్ 'గ్యాంగ్ లీడర్' రీమేక్ ఇది.

శంకర్ డైరెక్ట్ చేసిన తమిళ్ హిట్ 'జెంటిల్‌మెన్‌'ను హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు చిరంజీవి.

కన్నడ సినిమా 'సిపాయి'లో చిరు స్పెషల్ రోల్ చేశారు. ఆ సినిమాను 'మేజర్'గా తెలుగులో డబ్ చేశారు.

యాక్షన్ కింగ్ అర్జున్ 'శ్రీమంజునాథ'లో పరమేశ్వరునిగా చిరంజీవి నటించారు. అది కన్నడ సినిమా.

అతిథి పాత్రలు చేయడంతో పాటు కొన్ని సినిమాలకు చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.