అనుపమ లైఫ్‌లో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా?

మలయాళ 'ప్రేమమ్' అనుపమ తొలి సినిమా. తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేయగా సేమ్ రోల్ చేసింది. దానికి ముందు 'అ ఆ' చేసింది.

అప్పుడు అనుపమకు 19 ఏళ్ళు. కేరళలోని కొట్టాయంలో డిగ్రీ (ఇంగ్లీష్) చేస్తున్నారు. ఆడిషన్స్ ఇచ్చి 'ప్రేమమ్'కు సెలక్ట్ అయ్యారు.

'ప్రేమమ్' కోసం కాలేజీ మానేశారు అనుపమ. ఆ తర్వాత సినిమాలతో బిజీ కావడంతో చదువు వైపు చూసే అవకాశం రాలేదు.

మలయాళ 'ప్రేమమ్' సక్సెస్ తర్వాత తెలుగులో 'అ ఆ' చేశారు. తమిళ, కన్నడ సినిమాల్లో ఛాన్సులు వచ్చాయ్.

భరతనాట్యంతో పాటు క్లాసికల్ డ్యాన్సుల్లో అనుపమ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆమె న్యాచురల్ యాక్టర్.

మలయాళ సినిమా 'మణియారయిలే అశోకన్'కు అనుపమ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.

అనుపమ మల్టీ ట్యాలెంటెడ్. నటనతో పాటు రచన వచ్చు. పెయింటింగ్ వేస్తారు. బొమ్మలు చేస్తారు. యానిమల్ లవర్ కూడా!

అనుపమకు ఓ తమ్ముడు ఉన్నాడు. అతనితో కలిసి టూర్స్ వేయడం ఆమె హాబీ.

'శతమానం భవతి', 'టిల్లు స్క్వేర్', 'డ్రాగన్', 'రాక్షసుడు' వంటి హిట్ సినిమాల్లో అనుపమ నటించారు.