'మయసభ'లో మెయిన్ క్యారెక్టర్లు... సిరీస్‌లో కాదు, అసలు పేర్లు తెలుసా?

కాకర్ల కృష్ణమనాయుడు (నారా చంద్రబాబు నాయుడు?) పాత్రలో ఆది పినిశెట్టి నటించారు.

ఎంఎస్ రామిరెడ్డి (వైఎస్ రాజశేఖర్ రెడ్డి?) పాత్రలో చైతన్య రావు నటించారు.

రాయపాటి చక్రధర్ రావు (సీనియర్ ఎన్టీఆర్?) పాత్రలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటించారు.

హీరోయిన్ అను హారిక పాత్రలో తాన్యా రవిచంద్రన్ నటించారు. ఎవరీ కథానాయిక అనే ఆసక్తి నెలకొంది.

ప్రధాని ఐరావతి బసు (ఇందిరా గాంధీ?) పాత్రలో దివ్యా దత్తా నటించారు.

వాకాడా మహేష్ (వంగవీటి రంగ?) పాత్రలో శత్రు నటించారు.

పోతినేని రమేష్(పరిటాల రవి?) పాత్రలో రవీంద్ర విజయ్ నటించారు.

మీడియా మొఘల్ శివాజీ రావు (ఈనాడు అధినేత రామోజీ రావు?) పాత్రలో నాజర్ నటించారు.

బాంబుల శివారెడ్డి (వైఎస్ రాజారెడ్డి?) పాత్రలో శంకర్ మహంతి నటించారు.

చేకూరి బాబూరావు (నాదెండ్ల భాస్కర్ రావు?) పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు.

వైష్ణవి (రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ?) పాత్రలో భావనా వళపండల్  నటించారు.

రామేశ్వరి (చంద్రబాబు భార్య భువనేశ్వరి?) పాత్రలో చైత్ర వర్మ నటించారు.

సందీప్ బసు (సంజయ్ గాంధీ?) పాత్రలో సకుల్ శర్మ నటించారు.