'కింగ్‌డమ్' ప్రీ రిలీజ్ బిజినెస్... విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంతంటే?

నైజాంలో 'కింగ్‌డమ్' రైట్స్ రూ. 15 కోట్లకు అమ్మారని తెలిసింది. 

సీడెడ్ (రాయలసీమ) 'కింగ్‌డమ్' రైట్స్ వేల్యూ రూ. 6 కోట్లు.

ఏపీలో అన్ని ఏరియాల రైట్స్ కలిపి రూ. 15 కోట్లకు ఇచ్చారట. 

ఏపీ, తెలంగాణ రైట్స్ మొత్తం ద్వారా రూ. 36 కోట్లు 'కింగ్‌డమ్' నిర్మాతలకు వచ్చాయి.

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా 3.5 కోట్లు వచ్చాయి.

ఓవర్సీస్ మార్కెట్టులో విజయ్ దేవరకొండకు క్రేజ్ ఉంది. అందుకని రూ. 9.5 కోట్లు వచ్చాయి. 

డబ్బింగ్ రైట్స్ ద్వారా 'కింగ్‌డమ్' నిర్మాతలకు రూ. 3.50 కోట్లు వచ్చాయి.

'కింగ్‌డమ్' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 52.50 కోట్లు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్... రూ. 53.50 కోట్ల షేర్. అంత వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళతారు.