కోట నటనకు తొమ్మిది నందులు... ఏయే సినిమాలకో తెలుసా?

చిత్రసీమకు నటుడిగా కోట చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 

'ప్రతిఘటన'కు కోట శ్రీనివాస రావు తొలి నంది అందుకున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. 

'గాయం'లో విలనిజానికి కోట రెండో నంది పురస్కారాన్ని అందుకున్నారు. విలన్‌గా ఆయనకు అది మొదటి నంది. 

'తీర్పు' సినిమాకు గాను విలన్‌గా మరో నంది అవార్డు అందుకున్నారు కోట శ్రీనివాస రావు.

'లిటిల్ సోల్జర్స్'కు గాను ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కోట శ్రీనివాస రావును నంది వరించింది. 

'గణేష్' సినిమాకు గాను కోట శ్రీనివాస రావు విలన్‌గా నంది అవార్డు తీసుకున్నారు.

'చిన్నా' సినిమాలో విలనిజానికి గాను కోట శ్రీనివాస రావును మరో నంది అవార్డు వరించింది. 

'పృథ్వీ నారాయణ' సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా కోట శ్రీనివాస రావుకు నంది వచ్చింది. 

'ఆ నలుగురు'లో నటనకు ఉత్తమ సహాయ నటుడిగా కోట శ్రీనివాస రావును నంది వరించింది. 

'పెళ్ళైన కొత్తలో' సినిమాకు గాను కోట శ్రీనివాస రావు తొమ్మిదో నంది అందుకున్నారు.

'కృష్ణం వందే జగద్గురుమ్'కు సైమా అవార్డు, అల్లు రామలింగయ్య పురస్కారం వరించాయి.