యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, సిరీస్‌లతో కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్... ఈ రోజు హీరో అయ్యాడు.

హీరో కాకముందు... హీరో ఫ్రెండ్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్‌లో సుహాస్ నటించిన సినిమాలు ఏవో తెలుసా?

'పడి పడి లేచే మనసు' సినిమాలో శర్వానంద్ స్నేహితుడిగా సుహాస్ కనిపించారు. వెండితెరపై ఆయన మొదటి చిత్రమది.

'మజిలీ'లో నాగ చైతన్య ఫ్రెండ్ రోల్ చేశారు సుహాస్. అదీ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాలో ఏజెంట్ బాబీ పాత్రలో వినోదం పండించారు సుహాస్.

'డియర్ కామ్రేడ్'లో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా కనిపించారు సుహాస్.

'ప్రతిరోజూ పండగే'లో సాయి దుర్గా తేజ్ స్నేహితుడిగా సుహాస్ వేసిన పంచ్ డైలాగ్స్ నవ్వించాయి.

నితిన్ 'రంగ్ దే', సత్యదేవ్ 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య', 'అర్ధ శతాబ్దం' సినిమాల్లోనూ సుహాస్ నటించారు.

'కలర్ ఫోటో'తో ప్రమోషన్ కొట్టారు సుహాస్. అందులో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

హీరో అయ్యాక 'హిట్ 2'లో విలన్ రోల్ చేశారు. ఇప్పుడు తమిళ సినిమా 'మండాడి'లో విలన్ రోల్ చేస్తున్నారు.