'తమ్ముడు' టోటల్ థియేట్రికల్ బిజినెస్... బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

'భీష్మ' తర్వాత నితిన్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. అయినా సరే 'తమ్ముడు' మంచి బిజినెస్ చేసింది.

నైజాంలో 'తమ్ముడు' థియేట్రికల్ రైట్స్ 8.5 కోట్లుగా లెక్క కట్టారు. 

రాయలసీమలో 'తమ్ముడు' రైట్స్ రూ. 3 కోట్లకు ఇచ్చారు. 

ఆంధ్రలో ఏరియాలను రూ. 8.5 కోట్ల రేషియోలో అమ్మారు.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'తమ్ముడు' థియేట్రికల్ బిజినెస్ రూ. 20 కోట్లు.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ కలిపి రూ. 4 కోట్లు వచ్చాయట.

'తమ్ముడు' టోటల్ థియేట్రికల్ / ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 24 కోట్లు.

థియేటర్ల నుంచి రూ. 25 కోట్ల షేర్ రాబడితే 'తమ్ముడు' లాభాల్లోకి వెళుతుంది.

పాతిక కోట్ల టార్గెట్ తక్కువే. కానీ, నితిన్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ బట్టి కష్టం. ఏమవుతుందో? వెయిట్ అండ్ సి.