ప్రభాస్ సినిమాల్లో పరమ శివుడు... సంథింగ్ స్పెషల్!

రెబల్ స్టార్ సినిమాల్లో ఈశ్వరుని ప్రస్తావన వస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ లేదా సంథింగ్ స్పెషల్ అన్నట్టు! ఆ లిస్టు ఒక్కసారి చూడండి.

హీరోగా ప్రభాస్ ఫస్ట్ సినిమా 'ఈశ్వర్'. పరమేశ్వరుని పేరు నుంచి 'ఈశ్వర్' టైటిల్ వచ్చింది. సినిమాలోనూ హీరోది అదే పేరు.

ప్రభాస్ కెరీర్ టర్నింగ్ పాయింట్స్‌లో 'ఛత్రపతి' ఒకటి. అందులో హీరో పేరు శివ. అంటే... శివుడు అన్నట్టు!

'పౌర్ణమి' విడుదలైనప్పటి కంటే కొన్నాళ్లకు కల్ట్ స్టేటస్ వచ్చింది. అందులో ప్రభాస్ పేరు శివకేశవ నాయుడు.

'పౌర్ణమి'లో శివకేశవ పేరొక్కటే కాదు... 'భరత వేదముగ' పాట శివుడి మీద ఉంటుంది.

ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్ చేసిన సినిమా 'బాహుబలి'. అందులోనూ శివుని ప్రస్తావన ఉంది.

శివలింగాన్ని ఎత్తుకుని ప్రభాస్ జలపాతంలో దూకుతారు. ఆ క్యారెక్టర్ పేరు శివుడు. తర్వాత అతడు మహేంద్ర బాహుబలి అని తెలుస్తుంది.

శివుని భక్తుడి కథతో రూపొందిన 'కన్నప్ప'లో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించారు. 

నెక్స్ట్ ఏ సినిమాలో శివుని ప్రస్తావన ప్రభాస్ తీసుకు వస్తారో చూడాలి. వెయిట్ అండ్ సి.