మల్టీస్టారర్ ఫిలిమ్స్ చేయడానికి నాగార్జునకు ఎటువంటి అభ్యంతరం లేదు. 'కుబేర'కు ముందు ఎన్ని మల్టీ హీరో ఫిలిమ్స్ చేశారో తెలుసా?

నాగార్జున ఫస్ట్ మల్టీస్టారర్ ఏయన్నార్‌తో చేసిన 'కలెక్టర్ గారి అబ్బాయి'. అందులో తండ్రీ కొడుకులు కలిసి నటించారు.

'కలెక్టర్ గారి అబ్బాయి' తర్వాత 'అగ్ని పుత్రుడు', 'రావుగారి ఇల్లు', 'ఇద్దరూ ఇద్దరే' చేశారు ఏయన్నార్ & నాగార్జున.

సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నాగార్జున నటించిన మల్టీస్టారర్ సినిమా 'వారసుడు'. 

నందమూరి హరికృష్ణ, నాగార్జున అన్నదమ్మలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా 'సీతారామరాజు'.

కలెక్షన్ కింగ్, లెజెండరీ మోహన్ బాబు 'అధిపతి' సినిమాలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్ర చేశారు.

మేనల్లుడు సుమంత్‌తో కలిసి నాగార్జున చేసిన మల్టీస్టారర్ సినిమా 'స్నేహమంటే ఇదేరా'.

నాగార్జున, సౌందర్య జంటగా నటించిన 'నిన్నే పేమిస్తా' తెలుసు కదా! అందులో శ్రీకాంత్ మరొక హీరో. 

'కృష్ణార్జున' సినిమాలో విష్ణు మంచు మరొక హీరోగా నటించారు. అందులో నాగార్జున గాడ్ (దేవుడి పాత్ర) చేశారు. 

నాగార్జునకు మెమరబుల్ మల్టీస్టారర్ 'మనం'. అక్కినేని మూడు తరాలు నటించారు. 'శ్రీరామదాసు'లో ఏయన్నార్ ఉన్నారు. 

'సోగ్గాడే చిన్న నాయనా'లో నాగార్జున హీరో అయితే సీక్వెల్ 'బంగార్రాజు'లో నాగ చైతన్య యాడ్ అయ్యారు. 

తమిళ హీరో కార్తీతో బైలింగ్వల్ మల్టీస్టారర్ 'ఊపిరి', నానితో 'దేవదాస్‌' సినిమాలు చేశారు నాగార్జున.

నాగార్జున నటించిన హిందీ 'బ్రహ్మాస్త్ర', తెలుగు 'నా సామి రంగ' కూడా మల్టీస్టారర్ సినిమాలే. 

ధనుష్‌తో నాగార్జున నటించిన మల్టీస్టారర్ 'కుబేర'. రజనీకాంత్ 'కూలీ'లో ఆయనొక రోల్ చేశారు.