కుబేర థియేట్రికల్ (ప్రీ రిలీజ్) బిజినెస్... వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు? తెలుగులో ఎంత? టార్గెట్ ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో 'కుబేర' థియేట్రికల్ రైట్స్ వేల్యూ రూ. 33 కోట్ల కింద లెక్క కట్టినట్టు తెలిసింది.

'కుబేర' నైజాం రైట్స్ వేల్యూ రూ. 13 కోట్లు కింద లెక్క కట్టారు. ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. 

సీడెడ్ (రాయలసీమ) 'కుబేర' రైట్స్ రూ. 4.50 కోట్లకు ఇచ్చారు.

ఏపీలో అన్ని ఏరియాలు కలిపి రూ. 15.50 కోట్లకు 'కుబేర' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు.

ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో 'కుబేర' హిట్ అవ్వాలంటే రూ. 35 కోట్ల షేర్ రాబట్టాలి.

తమిళనాడులో 'కుబేర' థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ. 18 కోట్లు. 

రెస్టాఫ్ ఇండియా, కర్ణాటక రైట్స్ కలిపితే రూ. 5.50 కోట్లు వచ్చాయట. ఓవర్సీస్ రైట్స్ రూ. 8.50 కోట్లకు ఇచ్చారట.

'కుబేర' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 65 కోట్లు.

థియేటర్స్ నుంచి 'కుబేర' రూ. 125 కోట్ల గ్రాస్ (లేదా 67 కోట్ల షేర్) రాబడితే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి.