కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్... ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లు... రజనీ ముందున్న టార్గెట్ ఎంత?

లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో 'కూలీ' మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో బిజినెస్ బాగా జరిగింది. 

తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 110 కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఇది హ్యుజ్ అమౌంట్. 

కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేయడం, 'కుబేర' భారీ హిట్ కావడంతో తెలుగులోనూ బిజినెస్ బాగా జరిగింది.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ 44 కోట్లకు అమ్ముడు అయ్యాయి.

కర్ణాటకలో 'కూలీ' భారీ బిజినెస్ చేసింది. అక్కడ 30 కోట్లకు రైట్స్ తీసుకున్నారు.

'కూలీ' కేరళ రైట్స్... 19 కోట్లు. ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'కూలీ' నిర్మాతలకు 85 కోట్లు వచ్చాయి.

'కూలీ'లో ఆమిర్ ఖాన్ నటించడంతో హిందీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అవుతాయని అంచనా. 

హిందీ మినహా 'కూలీ' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 288 కోట్లు. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.