ఎవరీ మిత్రా శర్మ? 'వర్జిన్ బాయ్స్' హీరోయిన్ బ్యాగ్రౌండ్‌ తెలుసా?

'వర్జిన్ బాయ్స్' కంటే ముందు 'బిగ్ బాస్' ఓటీటీ ద్వారా తెలుగు ఆడియన్స్‌కు మిత్రా శర్మ తెలిశారు.

'బిగ్ బాస్' తెలుగు ఓటీటీ షోలో టాప్ 5 కంటెస్టెంట్లలో మిత్రా శర్మ ఒకరు. ఆ షో తనను తెలుగు ప్రజలకు దగ్గరయ్యానని చెబుతారు.

మిత్రా శర్మ అసలు పేరు మిత్రవింద. ఆవిడది ముంబై. ఆవిడ పుట్టింది, పెరిగింది ముంబైలోనే.

మిత్రా శర్మ డేట్ ఆఫ్ బర్త్ మే 24, 1993. తండ్రి సూచనతో నటనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. తండ్రి మరణించాక హైదరాబాద్ వచ్చారు.

హీరోయిన్ ఛాన్సుల కోసం మిత్రా శర్మ చాలా ఆఫీసుల చుట్టూ తిరిగిన మిత్రా శర్మ, చివరకు ప్రొడ్యూసర్ అయ్యారు.

శ్రీ పిక్చర్స్ సంస్థను స్థాపించిన మిత్రా శర్మ... 'బాయ్స్' ప్రొడ్యూస్ చేశారు. 'శ్రీ లక్ష్మి' అని మరో సినిమా స్టార్ట్ చేశారు.

మిత్రా శర్మకు భక్తి ఎక్కువ. ఆవిడ ఎక్కువ శివుడిని పూజిస్తారు.

ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి తనను మోసం చేశారని ఆ మధ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు మిత్రా శర్మ.

హర్ష సాయి హీరోగా మిత్రా శర్మ నిర్మాణంలో ఓ సినిమా కూడా మొదలైంది. అవన్నీ పక్కనపెట్టి కెరీర్ మీద కాన్సంట్రేట్ చేశారు.