కింగ్‌డమ్ to ప్రభాస్ సినిమా... 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ చేతిలో సినిమాల లిస్ట్

'మిస్టర్ బచ్చన్'తో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా పరిచయం అయ్యారు. ఆవిడ అందానికి పేరొచ్చింది.

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా 'కింగ్‌డమ్‌'లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.

ఆల్రెడీ విడుదలైన పాటల్లో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ, లిప్ లాక్ హైలైట్ అయ్యింది. 

రామ్ పోతినేని సరసన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. 

దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా సినిమా 'కాంత'లోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. 

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ తీయబోయే సినిమాలో భాగ్యశ్రీ ఛాన్స్ కొట్టేశారట. ఆ న్యూస్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమాలోనూ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఆయనతోనూ ఆమెకు తొలి చిత్రమిది. 

'లెనిన్' సినిమాలో కథానాయికగా ఫస్ట్ ఛాయిస్ శ్రీ లీల. ఆవిడ తప్పుకోవడంతో భాగ్యశ్రీ ఛాన్స్ కొట్టేశారు. 

భాగ్యశ్రీ బోర్సే చేతినిండా సినిమాలు ఉన్నాయి. మరో రెండు మూడు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయట.