రష్మికా మందన్నా భారతీయ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్. పాన్ ఇండియా హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసింది. మరెన్నో లైన్లో పెట్టింది.
రష్మిక అందంతోనే కాదు నటనతోనూ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. నటిగా డ్యాన్స్, యాక్షన్ సీన్స్, హార్ట్ టచింగ్ యాక్ట్‌తో ఎందరి హృదయాలనో గెలుచుకుంది.
రష్మిక కన్నడ సినిమాతో కెరీర్ ప్రారంభించినా.. ఇప్పుడు పలు భాషల్లో నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటుంది. తన నటనకు ప్రాధన్యం ఉన్న కథలు ఎంచుకుంటూ.. క్రేజీ ప్రాజెక్ట్‌లతో సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. దీనిలో భాగంగానే కొన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టింది.
యానిమల్ భారీ విజయం తరువాత.. రష్మిక యానిమల్ పార్క్‌తో రణ్‌బీర్ కపూర్ సరసన గీతాంజలిగా మళ్లీ రానుంది.
శ్రీవల్లిగా రష్మిక పుష్ప ఫ్రాంచైజీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పుష్ప 3 సినిమా ఉంటుందని అల్లు అర్జున్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. దీంతో పుష్ప 3లో కూడా రష్మిక కనిపించనుంది.
మైసాలో రష్మిక మునుపెన్నడు కనిపించని విధంగా కనిపించనుంది. క్రూరమైన గోండ్ యోధురాలి పాత్ర చేస్తుంది. ఇప్పటికే రిలీజైన్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక నటించింది. ఈ లవ్ స్టోరి సినిమా నుంచి వరుసగా విడుదలవుతున్న పాటలు ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలను పెంచేశాయి.
రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా థామా సినిమా చేస్తున్నారు.
శాంతరూబన్ దర్శకత్వంలో రెయిన్బో సినిమాలో దేవ్ మోహన్‌తో కలిసి జతకట్టింది రష్మిక. అయితే ఈ సినిమా 2023లోనే మొదలైనప్పటికీ.. ప్రస్తుతం దీని ప్రస్తావన వినిపించట్లేదు.