Vishwanath And Sons Pre Release Business : విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
Vishwanath And Sons Pre Release Business : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మంచి నెంబర్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఓటీటీ రైట్స్ సైతం బిగ్ డీల్ జరిగినట్లు సమాచారం.

Suriya's Vishwanath And Sons Pre Release Business Full Details : కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), స్టార్ డైరెక్టర్ వెంకీ దర్శకత్వంలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath And Sons). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించగా... ఆగస్ట్ 14న తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించగా... ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
విశ్వనాథ్ అండ్ సన్స్ థియేట్రికల్ రైట్స్ రూ.90 కోట్లకు అమ్ముడు కాగా... నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.215 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓటీటీ రైట్స్‌ను ఇంటర్నేషనల్ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) రూ.85 కోట్లకు సొంతం చేసుకోగా... శాటిలైట్ రైట్స్ రూ.28 కోట్లు, ఆడియో రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లు కాగా... తమిళనాడులో రూ.45 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు, మిగిలిన చోట్ల రూ.5 కోట్లకు సేల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అటు, ఓవర్సీస్‌లో రూ.15 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లకు సేల్ అయినట్లు తెలుస్తోంది. రిలీజైన తర్వాత కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ మూవీలో సూర్య మాజీ ఒలింపిక్ షూటర్ సంజయ్ విశ్వనాథ్‌గా కనిపించనున్నారు. తన బిడ్డకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కాగా ఆ తండ్రి ఏం చేశాడు? తన కంటే 20 ఏళ్ల పెద్దవాడైన హీరోను హీరోయిన్ ప్రేమిస్తే ఏం జరిగింది? అనేదే ప్రధానాంశంగా ఈ స్టోరీని రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
సూర్య కెరీర్‌లో ఇది 46వ సినిమా కాగా... ఆయనకు తెలుగులో డైరెక్ట్‌గా ఇదే ఫస్ట్ మూవీ. సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించగా... శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ట్రెండింగ్ వార్తలు






















