Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
ఎల్పీజీ సిలిండర్ల కొరత దేశంలో లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తరుపున పెట్రోలియం శాఖ మాట్లాడిన జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ...వినియోగదారులు LPG సిలిండర్లపై నే ఆధారపడుకుండా PNG కి మారిపోవాలని సూచించారు. ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీలు ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.వాణిజ్య (Commercial) LPG వినియోగదారులు వీలైనంత వరకు PNGకి మారాలని విజ్ఞప్తి చేశారు; ఇందుకోసం కంపెనీలు ప్రోత్సాహకాలను (incentives) కూడా ప్రకటించాయి
గత మూడు రోజుల్లో దాదాపు 5600 కంటే ఎక్కువ మంది LPG వినియోగదారులు PNGకి మారారు.గత రెండు వారాల్లో సుమారు 1.25 లక్షల కొత్త గృహ, వాణిజ్య మరియు పారిశ్రామిక కనెక్షన్లు ఇవ్వబడ్డాయి యుద్ధం కారణంగా LPG పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ఏ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నిల్వలు నిండుకోలేదు (No dry out) ఆన్‌లైన్ బుకింగ్‌లు 94% కి పెరిగాయి మరియు నిన్న సుమారు 57 లక్షల రీఫిల్ బుకింగ్‌లు వచ్చాయి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















