Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
కింగ్ విరాట్ కోహ్లీ తిరిగొచ్చేశాడు. ఈసారి మహారాజు ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెట్టాడు. తన లుక్, తన స్టైల్, తన స్వాగ్ లో ఎప్పటిలాంటి ఆరానే కనిపిస్తోంది. కాకపోతే ఈసారి మరికొంత పదునెక్కినట్లు కనిపిస్తున్నాడు. వెయిట్ లాస్ అయ్యి సన్నగా కరెంట్ తీగలా తయారయ్యాడు. చెవికి పోగు...రెండు చేతుల నిండా సరికొత్తగా కనిపిస్తున్న టాటూస్...ఫిట్ నెస్ తో తొణికిసలాడుతున్న బాడీతో 37 ఏళ్ల వయస్సులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీ నిర్వహించిన హోం కమింగ్ ఈవెంట్ లో ఉత్సాహంగా పాల్గొన్న విరాట్..ఈసారి కన్నడ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాడు. అదేంటంటే తన ప్రోమోలో కన్నడలో మాట్లాడేశాడు కోహ్లీ. 18ఏళ్లుగా ఆర్సీబీపై ఎనలేని ప్రేమ చూపిస్తున్న ఫ్యాన్స్ కోసం కన్నడ లో కొన్ని మాటలు నేర్చుకున్న కోహ్లీ... అదే అధ్యాయ, హోస కథే నిమ్మ విరాట్ నిమ్మ జోతే అంటూ కన్నడలో అదరగొట్టాడు. అంటే అధ్యాయం..కానీ కొత్త కథ..మీ విరాట్ మీ తోటి అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. అంతే కాదు ప్లేయర్స్ తో ప్రాక్టీస్ సెషన్స్ ను మొదలుపెట్టాడు. ఇన్నాళ్లూ వన్డే ఫార్మాట్ కి మాత్రమే పరిమితమైన మచ్చలపులి విన్యాసాలను ఏడాది తర్వాత టీ20 ఫార్మాట్ లో చూడొచ్చన్న మాట. చూడాలి 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకున్న రజత్ పాటిదార్ సేన మరోసారి కప్ గెలిచి వరుసగా రెండు సార్లు కప్పులు సాధించిన చెన్నై, ముంబై జట్ల సరసన నిలుస్తుందేమో.
ట్రెండింగ్ వార్తలు






















