అన్వేషించండి

Iran War Updates: సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?

Gulf countries: ఇరాన్ తమ ఆయిల్ సంపదపై దాడి చేస్తూండటంతో అరబ్ దేశాలు ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇరాన్ పై మూకుమ్మడిగా దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

Will the Gulf countries attack Iran:  గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ , ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు నేరుగా సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు పాకాయి. బుధవారం   నాడు ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు సౌదీ రాజధాని  రియాద్‌ ను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ దాడుల కారణంగా  సౌదీ అరేబియా తన సహనం నశించిందని, ఇరాన్‌పై సైనిక చర్యకు తాము సిద్ధమని బహిరంగంగానే హెచ్చరించింది.
 
రియాద్‌పై ఇరాన్ ప్రయోగించిన నాలుగు క్షిపణులను సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు  అడ్డుకున్నాయి. అయితే, కూలిన క్షిపణి శకలాలు నివాస ప్రాంతాలపై పడటంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గల్ఫ్ దేశాలైన  ఖతార్, యూఏఈ, బహ్రెయిన్  లలోని కీలక ఇంధన కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది. ఫిబ్రవరి 28న ఇరాన్ గ్యాస్ నిల్వలపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగానే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

ఈ ఉద్రిక్తతల మధ్య  పాకిస్థాన్ పాత్ర కీలకంగా మారింది. 2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాతో పాకిస్థాన్ కుదుర్చుకున్న  వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం.. సౌదీపై ఏదైనా దేశం దాడి చేస్తే, దానిని తమపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాక్ పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా మాట్లాడుతూ.. సౌదీ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగితే తాము సైనిక పరంగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. అయితే, సొంత దేశంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పాక్ నేరుగా యుద్ధంలోకి దిగుతుందా లేదా అనేది వేచి చూడాలి.   

సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గురువారం ఇరాన్‌తో మేం నిర్మించుకున్న కొద్దిపాటి నమ్మకం ఇప్పుడు పూర్తిగా ముక్కలైంది అని వ్యాఖ్యానించారు. అరబ్ దేశాల అత్యవసర సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ దేశ రక్షణ కోసం  సైనిక చర్యకు (Military  తాము వెనకాడబోమని, ఆ హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే కువైట్, బహ్రెయిన్, యూఏఈ వంటి దేశాలు సౌదీకి మద్దతుగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతం గల్ఫ్ దేశాలు ఇరాన్‌పై నేరుగా దాడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా కూడా తన సైనిక స్థావరాలను అప్రమత్తం చేయడమే కాకుండా, సౌదీకి అవసరమైన రక్షణ సహాయాన్ని అందజేస్తోంది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం, చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లు దాటడంతో.. ఈ ప్రాంతంలో మరో పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget