అన్వేషించండి

Amazon Prime Series : అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్

Amazon Prime New Series : ఫేమస్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది స్ట్రీమింగ్ కాబోయే మూవీస్, వెబ్ సిరీస్‌లను అనౌన్స్ చేసింది. సరికొత్త వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Amazon Prime Video New Web Series Movies Full List : మూవీ లవర్స్‌ను మరింత ఎంటర్టైన్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' రెడీ అవుతోంది. ఈ ఏడాదికి వరుస లైనప్స్ అనౌన్స్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద కంటెంట్ స్లేట్ ప్రకటించింది. ముంబైలో జరిగిన 'ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ 2026' ఈవెంట్‌లో భాగంగా దాదాపు 55కు పైగా ఒరిజినల్ సిరీస్, సినిమాలు, థియేట్రికల్ మూవీస్ అధికారికంగా ఆవిష్కరించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులు విభిన్న జానర్లలో ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచనున్నాయి.

వెబ్ సిరీస్‌లివే...

  • స్ట్రామ్ - పార్వతి తిరువొత్తు, అలయా, సృష్టి శ్రీవాస్తవ, రామ్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌కు అజిత్ పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
  • లుఖే - రాశీఖన్నా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్. హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో రాపర్ కింగ్, పాలక్ తివారీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
  • రాపూ - మనీష్ పాల్, అంగిరా ధర్ కీలకపాత్రలు పోషించారు. శశాంక్ బాలి దర్శకత్వం వహించారు.
  • కర్నామే బద్లా... గేర్ పల్టీ కిస్మత్ - పూరవ్ ఝా, నమన్ జైన్, సాకిబ్ నజర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వినయ్ వైకుల్ దర్శకత్వం వహిస్తున్నారు.
  • ది ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ - రవి కిషన్, ఆదిత్య రావల్, అశ్వినీ భావే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సౌరభ్ భావే దర్శకత్వం వహిస్తున్నారు.
  • ది ట్రైటర్స్ - టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా రియాల్టీ షో తెలుగులోనూ రానుంది. ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఇంగ్లీష్, హిందీల్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అయిన షోను తెలుగులోనూ లాంచ్ చేయనున్నారు.
  • వీటితో పాటే 'ది రివల్యూషనరీస్', విజయ్ వర్మ మట్కా కింగ్, తొలి హిందీ స్వదేశీ సూపర్ హీరో సిరీస్ 'వంశ్' వంటి ప్రాజెక్టులతో పాటు సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఫర్టీ సీజన్ 2, పంచాయత్ సీజన్ 5, కాల్ మీ బే సీజన్ 2, దహాద్ సీజన్ 2 సిరీస్‌లు త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నాయి.
  • ది  కలియుగ్ వారియర్స్, కాలేజ్ ఫెస్ట్, గ్రామ్ చికిత్సాలయ్ (సీజన్ 2), ది పిరమిడ్ స్కీమ్, సప్నే Vs ఎవ్రీవన్ సీజన్ 2, సందీప్ భయ్యా సీజన్ 2, దోనో మిల్ ఇస్ తరా, నాజ్దికియాన్, ది ట్రైటర్స్ సీజన్ 2 (హిందీ). తమిళంలో 'వదంది', 'ఇన్‌స్పెక్టర్ రిషి'ల రెండో సీజన్స్ రాబోతున్నాయి.

Also Read : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం

తెలుగు సిరీస్‌/మూవీస్...

  • టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫస్ట్ వెబ్ సిరీస్ 'గువ్వల చెరువు ఘాట్' సైతం అనౌన్స్ చేశారు. 
  • ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ 'ఇసకపట్నం'. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు.
  • టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ గల్లీ. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోంది.
  • యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'ఇన్స్పెక్టర్ రిషి' సీజన్ 2 సైతం రానుంది.
  • విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సిరీస్ 'జగమే సంగీతం'. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

రాబోయే సినిమాలివే...

  • నాగ్జిల్లా - కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి మృగదీప్ సింగ్ లంబా దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్ కానుంది.
  • వ్వాన్ : ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ - సిద్దార్థ్ మల్హోత్రా, తమన్నా, సునీల్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తుండగా.... థియేట్రికల్ రన్ తర్వాత అందుబాటులోకి రానుంది. వీటితో పాటే అనర్థ్ మూవీ కూడా స్ట్రీమింగ్ కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Nagabandham OTT: నాగబంధం ఓటీటీ రిలీజ్ డేట్... థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ - ఎందులోనంటే? 
థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న నాగబంధం
Ego Raman OTT : రెండు ఓటీటీల్లో లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget