USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
ఫ్యూచర్ స్టార్లను అందించే వేదికగా పేరు తెచ్చుకున్న U19 ప్రపంచ కప్ లో భారత్ జైత్రయాత్రను ప్రారంభించింది. USA అండర్ 19 జట్టుతో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్ లో భారత అండర్ 19 జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ కు పేస్ బౌలర్ హేనిల్ పటేల్ కొండంత అండగా నిలిచాడు. ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన హేనిల్ 7 ఓవర్లలో 16పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి USA నడ్డి విరిచాడు. టాప్ 6 USA బ్యాటర్లలో నలుగురిని హేనిల్ పటేలే ఔట్ చేయటం విశేషం. హేనిల్ తో పాటు మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో 35 ఓవర్లు ఆడిన USA 107 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తర్వాత భారత్ బ్యాటింగ్ ఆరంభించగానే వర్షం మొదలైంది. ఆ తర్వాత ఆట మొదలైన వెలుతురు లేకపోవటంతో ఆగిపోయింది. దీంతో DLS ప్రకారం లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96పరుగులుగా నిర్ణయించారు. ఈ వరల్డ్ కప్ లో అందరి కళ్లూ ఎదురు చూస్తున్న వైభవ్ సూర్య వంశీ 2 పరుగులకే క్లీన్ బౌలడ్ అయి వెనుదిరగగా మరో ప్రామిసింగ్ ప్లేయర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. త్రివేది, విహాన్ తక్కువ పరుగులకే వెనుదిరిగినా వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు 42పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు ఉన్న చిన్న లక్ష్యాన్ని చేధించేశాడు. ఫలితంగా భారత్ 6వికెట్ల తేడాతో ఫస్ట్ విక్టరీ అందుకుంది. బాల్ తో అదరగొట్టిన హేనిల్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.





















