Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
టీమిండియాకు ఆడే ఆటగాళ్లైనా సరే దేశవాళీ మ్యాచ్ లు ఆడాల్సిందే అనేది ఇప్పుడు బీసీసీఐ రూల్. ఇంటర్నేషనల్ సిరీస్ లకు ముందో లేదా ఏదైనా చిన్న గాయం కారణంగా రెస్ట్ తీసుకుని వస్తేనో కచ్చితంగా డొమెస్టిక్ మ్యాచెస్ ఆడి రావాలని ఖరాఖండీగా చెప్పేస్తున్నాడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ. అందుకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు కూడూ ఈ మధ్య డొమెస్టిక్ మ్యాచులు ఆడుతూ కనబడుతున్నారు. అయితే రీసెంట్ గా ఓ స్టార్ బౌలర్ చుట్టూ పెద్ద డిస్కషన్ నడుస్తోంది. తనే మహ్మద్ సిరాజ్. లాస్ట్ ఇయర్ ఇంగ్లండ్ తో వాళ్ల సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో బుమ్రా లేని లోటు కనపడనీయకుండా ఒంటి చేత్తో విజయాలు సాధించిన మియా భాయ్...తర్వాత ఎందుకో టీమ్ సెలక్షన్ లో స్థానం సంపాదించలేకపోయాడు. ఓ మహ్మద్ షమి, ఓ మహ్మద్ సిరాజ్ ఇకపై భారత్ కు ఆడకుండా ఎవరో అడ్డుపడుతున్నారంటూ చర్చలు కూడా నడిచాయి. సరే అది అక్కన పెడితే సుదీర్ఘ విరామం తర్వాత మహ్మద్ సిరాజ్ కి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు మియా భాయ్ ఎంపికయ్యాడు. ఓకేయిష్ ప్రదర్శన కూడా చేస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ వన్డే ఆడారు. అయితే తర్వాత టీ20సిరీస్ కివీస్ తో ఉండటం దీనికి ఆల్మోస్ట్ టీ20 వరల్డ్ కప్ టీమ్ నే ఆడిస్తుండటంతో సిరాజ్ ను మళ్లీ దేశవాళీ మ్యాచుల్లో ఆడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా ఆటగాడిగా కాదు. రంజీ మ్యాచుల్లో ముంబై, ఛత్తీస్ గఢ్ తో జరగబోయే మ్యాచ్ లకు హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. అసలు వన్డే సిరీస్ పూర్తి కాకుండానే సిరాజ్ ను రంజీ మ్యాచులకు కెప్టెన్ చేయటం...తను వెంటనే రంజీ మ్యాచుల్లో హైదరాబాద్ ను నడిపించాల్సి రావటం వెనుక ఎవరి ప్లాన్ ఉందో అని మళ్లీ చర్చలు మొదలవుతున్నాయి. ఒకటి రెండు మ్యాచులు ఆడాల్సిందే అని ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కి షరతులు ఉన్నా ఇలా కెప్టెన్ చేసి రంజీ భారాన్ని సిరాజ్ పై మోపటం తనకు భారం కావచ్చు అనేది మరికొంత మంది వాదన. మొత్తానికి సిరాజ్ ఎక్స్ పీరియన్స్ వాడుకోవటానికే ఈ నిర్ణయాన్ని HCA తీసుకుందా లేదా మరేదైనా ప్లాన్ ఉందా ఫ్యూచరే డిసైడ్ చేయాలి.





















