అన్వేషించండి

CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?

CEC impeachment notice: భారత రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పావులు కదుపుతున్నాయి.

CEC Gyanesh Kumar impeachment notice: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్  జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో  ఇండియా  కూటమికి చెందిన  193 మంది ఎంపీలు  సంతకాలు చేసిన నోటీసును సిద్ధం చేశారు. ఇందులో లోక్‌సభకు చెందిన 130 మంది, రాజ్యసభకు చెందిన 63 మంది ఎంపీలు ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులోని ఏదో ఒక సభలో ఈ నోటీసును సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక సీఈసీని తొలగించడానికి పార్లమెంటులో నోటీసు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి . 

నిబంధనల ప్రకారం.. 

రాజ్యాంగం ప్రకారం, ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియనే  అనుసరించాల్సి ఉంటుంది. లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసును ఇస్తేనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విపక్షాల వద్ద అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉండటంతో ఈ నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా కూటమి పార్టీలతో పాటు, ప్రస్తుతం కూటమిలో అధికారికంగా లేని ఆమ్ ఆద్మీ పార్టీ  ఎంపీలు కూడా దీనిపై సంతకాలు చేశారు.

సీఈసీపై ఉన్న ఏడు ప్రధాన ఆరోపణలు 

ఈ నోటీసులో జ్ఞానేష్ కుమార్‌పై మొత్తం ఏడు రకాల తీవ్రమైన ఆరోపణలను విపక్షాలు పొందుపరిచాయి. అందులో ప్రధానంగా అధికారంలో ఉండి పక్షపాతంగా వ్యవహరించడం,  ఎన్నికల అవకతవకలపై దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం,  ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు వంటి అంశాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి.

రాజకీయ ఉత్కంఠ 

పార్లమెంటులో ఈ నోటీసును సమర్పించిన తర్వాత, దానిని ఆమోదించాలా లేదా అనేది స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ నోటీసు ఆమోదం పొందితే, ఆరోపణల విచారణ కోసం ఒక కమిటీని వేయాల్సి ఉంటుంది. అయితే, అధికార పక్షానికి మెజారిటీ ఉన్నందున ఈ తీర్మానం నెగ్గడం కష్టమే అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై దేశవ్యాప్తంగా చర్చ లేవనెత్తడమే విపక్షాల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

సీఈసీని తొలగించే ఈ రాజ్యాంగ ప్రక్రియ ఇలా!

అభిశంసన నోటీసును ఆమోదిస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ,  ఒక ప్రముఖ న్యాయకోవిదుడితో కూడిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఆరోపణలు నిజమని తేల్చి నివేదిక ఇస్తేనే, పార్లమెంటులో అసలు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలో ఉభయ సభల్లోనూ  ప్రత్యేక మెజారిటీ  అంటే.. సభలోని మొత్తం సభ్యులలో సగానికి పైగా,   ఓటింగ్ వేసిన వారిలో మూడింట రెండొంతుల మంది మద్దతు లభించాలి. ఒకే సెషన్‌లో రెండు సభలు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే, అప్పుడు రాష్ట్రపతి తుది ఉత్తర్వు జారీ చేయడం ద్వారా సీఈసీని పదవి నుంచి తొలగిస్తారు.                   


 

టాప్ హెడ్ లైన్స్

India Hockey Jersey: హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget