భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రాజెక్టు వద్దకు చేరుకుని వరద ఉధృతిని, నీటిమట్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.