అన్వేషించండి

Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!

Palamuru Rangareddy Supreme Court Verdict: పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు. ప్రాజెక్టులకు దక్కిన పూర్తి చట్టబద్ధ రక్షణ కల్పించింది.

 Telangana Irrigation Projects EC Relief :  తెలంగాణలోని ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు సుప్రీంకోర్టులో అత్యంత భారీ ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. వివాదాస్పద పర్యావరణ అనుమతుల అమలుకు అడ్డంకులు తొలగిపోవడంతో, రాష్ట్రంలో వేలాది ఎకరాలకు సాగునీరు మరియు కోట్లాది మందికి తాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనులకు దారి సుగమమైంది.

అనుమతులన్నీ చెల్లుబాటు                                

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 2021 నాటి కేంద్ర పర్యావరణ శాఖ కార్యనిర్వాహక మెమోరాండం ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే, గతంలో ఆ మెమోరాండం ఆధారంగా మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ పూర్తిగా చెల్లుబాటులో ఉంటాయని ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ కీలక నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి నిర్మాణాలు పూర్తి చట్టబద్ధమైన రక్షణను పొందినట్లయింది. న్యాయస్థానాల ఆదేశాల కారణంగా ఇన్నాళ్లూ పనుల్లో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు కొత్త ఊపిరి పోశాయి. ఈ తీర్పు కేవలం భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న కీలక ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ముప్పు లేదని తేల్చిచెప్పడంతో, రాష్ట్రవ్యాప్తంగా పనులు నిలిచిపోయిన రిజర్వాయర్లు, కెనాళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కానుంది.

ఆఫీస్ మెమోరాండమ్‌లతో ఆపలేరు!                       

తీర్పు సందర్భంగా పర్యావరణ పరిరక్షణ , చట్టాల అమలుపై సీజేఐ ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆఫీస్ మెమోరాండమ్‌లు లేదా కార్యనిర్వాహక ఉత్తర్వులతో  చట్టాలను రూపుమాపడం లేదా భర్తీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ముందస్తు పర్యావరణ అనుమతులు  లేని ఏ నూతన ప్రాజెక్టుకూ పర్యావరణ రక్షణ చట్టాలకు విరుద్ధంగా మినహాయింపులు లేదా అనుమతులు మంజూరు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

తెలంగాణకు ఎంతో మేలు                         

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుపై తెలంగాణ ప్రజలు, ము ఖ్యంగా మహబూబ్‌నగర్, రంగా రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట ప్రాంతాల రైతాంగం తీవ్ర హర్షం వ్యక్తం చేస్తోంది. పర్యావరణ అనుమతుల వివాదం శాశ్వతంగా ముగియడంతో, నిధుల సమీకరణను వేగవంతం చేసి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ తీర్పుతో తెలంగాణ సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది.         

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget