అన్వేషించండి

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy | ప్రతిపక్షాల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, సభకు కేసీఆర్ వచ్చి చర్చించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.
  • తెలంగాణకు రూ.8.11 లక్షల కోట్ల అప్పు BRS చేసిందని సీఎం విమర్శ.
  • కాళేశ్వరం వైఫల్యాలను ఎత్తిచూపుతూ, వరి కొనుగోలుకు ₹90 వేల కోట్లు చెల్లింపు.

Telangana Assembly sessions | పరకాల: పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, తమ ప్రజా ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతుందో చర్చించడానికి సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తప్పకుండా రావాలని సవాల్ విసిరారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ సమక్షంలోనే గత పదేళ్ల సంక్షేమం, అభివృద్ధి.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చిద్దామని కేసీఆర్‌ను ఆహ్వానించారు. 

హనుమకొండ జిల్లా పరకాలలో రూ.484 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అక్కడ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు సాగించిన దాడులు, ఫోన్ ట్యాపింగ్ వంటి అణచివేత చర్యలను ప్రజలు తమ చైతన్యంతో తిప్పికొట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరితేరిన దిగ్గజాలను కూడా సామాన్య ప్రజలు ఓడించగలరని, యశస్విని అనే యువతి 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ గెలుపు తనది కాదని, ప్రజల చైతన్యానిదని, ఆ చైతన్యమే ఈ ప్రాంతంలో 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేసిందన్నారు. 

సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా..
అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రతిపక్ష నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందించారు. సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ చర్చకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కావాలని.. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనపై బహిరంగంగా చర్చిద్దామని ఆయన సవాల్ విసిరారు.

Also Read: India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా

రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన బీఆర్ఎస్..

గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం గురించి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఏటా 6,500 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంటే, కెసిఆర్ ప్రభుత్వం దిగిపోయేనాటికి 8,11,000 (8 లక్షల 11 వేల కోట్ల రూపాయలు) కోట్ల భారీ అప్పును వారసత్వంగా ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ అప్పులకు అసలు, వడ్డీ కలిపి నెలకు 7,500 కోట్లు, అంటే ఏడాదికి సుమారు 75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోందని వివరించారు. ఇన్ని కష్టాల్లోనూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాను రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నానని.. గత 32 నెలల్లో ఏ రోజూ కనీసం మూడు రోజులు కూడా విరామం  తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. 

వ్యవసాయం, మౌలిక సదుపాయాల గురించి ప్రస్తావిస్తూ, లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎత్తిచూపారు. ఆ ప్రాజెక్టును ఆయన 'కూలేశ్వరం'గా అభివర్ణించారు. అయితే, తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ, గత 30 నెలల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 90,000 కోట్ల రూపాయలు చెల్లించిందని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు 

 

Frequently Asked Questions

శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి?

సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత 10 సంవత్సరాల BRS పాలన మరియు ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై చర్చించడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి.

చర్చకు ముఖ్యమంత్రి ఎవరిని ఆహ్వానించారు?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చర్చకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

గత ప్రభుత్వంపై అప్పుల ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కారణం ఏంటి?

కెసిఆర్ ప్రభుత్వం 8 లక్షల 11 వేల కోట్ల భారీ అప్పును వారసత్వంగా ఇచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఈ అప్పుకు నెలకు 7,500 కోట్లు, ఏడాదికి 75,000 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమని వ్యాఖ్యానించారు?

లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి 'కూలేశ్వరం'గా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వైఫల్యాలను ఆయన ఎత్తిచూపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget