Iran Israel War: ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
UN general secretary antonio guterres | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంక్షోభం అంతర్జాతీయ శాంతికి ముప్పు అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ప్రజలు ఇబ్బందుల్ని గుర్తుచేశారు.

US Iran Conflict | అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుందన్నారు. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో పోరాడుతున్న సమయంలో ఆంటోనియో గుటెరెస్ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న అశాంతి కారణంగా చాలా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయింది.
యుద్ధాన్ని ఆపాలని UN ప్రధాన కార్యదర్శి గుటెరెస్ విజ్ఞప్తి
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో పెరుగుతున్న యుద్ధం, సంక్షోభ పరిస్థితులు అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పు అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ‘ఈ యుద్ధం వల్ల చాలా దేశాల్లో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు జరపడమే ఏకైక మార్గం. శత్రుత్వాన్ని పక్కనపెట్టి, అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ.. సామాన్య ప్రజలను రక్షించాలని, వెంటనే చర్చలు మొదలుపెట్టాలని అన్ని పక్షాలను కోరుతున్నానని’ మూడు దేశాల అధినేతలకు సూచించారు.
The unfolding crisis in the Middle East constitutes a grave threat to international peace and security and has caused immense suffering for civilians.
— António Guterres (@antonioguterres) March 12, 2026
De-escalation and dialogue are the only way out.
I strongly urge all parties to cease the hostilities, uphold international…
యుద్ధంలో ఇరాన్ కు చెందిన 1300 మంది మృతి
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం దాదాపు రెండు వారాలుగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని నియమించారు. యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ముప్పు, హర్మూజ్ జలసంధిలో మైన్స్ అమర్చడానికి ప్రయత్నాలు, ఆ మార్గంలో వెళ్తున్న షిప్‌లపై బాంబు దాడులు జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటివరకు 10 వేల కంటే ఎక్కువ పౌర ప్రదేశాలపై దాడులు చేశాయని ఇరాన్ ఆరోపించింది. ఇందులో ఇళ్లు, స్కూల్స్, ఇతర సాధారణ ప్రదేశాలు కూడా ఉన్నాయని... ఈ యుద్ధంలో ఇరాన్ కు చెందిన 1300 మంది మరణించారని అధికారులు చెబుతున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ అధినేతల మధ్య ఈగో వార్..
పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతలు ప్రస్తుతం దేశాధినేతల మధ్య Ego War గా మారాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని, ఇక అక్కడ లక్ష్యాలేమీ లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. యుద్ధాన్ని ముగించి అమెరికా సైనిక వ్యయాన్ని తగ్గించాలనేది ఆయన వ్యూహం. లేదంటే అమెరికాలోనూ యుద్ధ ప్రతికూల ప్రభావం పడుతుంది.
అయితే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీనితో ఏకీభవించడం లేదు. ఇరాన్ అణు, క్షిపణి కేంద్రాలను పూర్తిగా నిర్మూలించే వరకు విశ్రమించబోమని, అవసరమైతే ఒంటరి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. అమెరికా తన మాట నెగ్గించుకోవాలని చూస్తుంటే, ఇజ్రాయెల్ తన ప్రాంతీయ ఆధిపత్యం కోసం పట్టుబడుతోంది. ఈ పరస్పర విరుద్ధ వైఖరులు యుద్ధాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.
ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉంది. కానీ తమ షరతులకు అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాలని ఇరాన్ అధినేత డిమాండ్ చేస్తున్నారు. యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని భరించి, ఆ మొత్తం ఇరాన్‌కు చెల్లించడం. తమ దేశ నిర్ణయాలు, చర్యల్లో భవిష్యత్తులోనూ జోక్యం చేసుకోమని అమెరికా ఒష్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అకారణంగా తమ దేశంపై యుద్ధం చేయకూడదని ఇరాన్ నుంచి డిమాండ్లు వచ్చాయి.
ట్రెండింగ్ వార్తలు
























