ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియా, ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటుతుంది. ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో మన కుర్రాళ్లు అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు.
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొసాగుతున్నాడు. మరో విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) రెండవ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌లో 317 పరుగులు చేసిన ఇషాన్, 871 పాయింట్లతో తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు.
ఇక ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్ ( Sanju Samson ) ఏకంగా 22వ స్థానానికి చేరుకోవడం విశేషం. 199 స్ట్రైక్ రేట్ సంజూని ఐసీసీ ర్యాంకింగ్స్ రేసులో నిలబెట్టింది. తిలక్ వర్మ 7వ స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 9వ స్థానంలో నిలిచారు.
బౌలింగ్ విభాగంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ( Varun Chakravarthy ) అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఆరో స్థానానికి చేరుకోగా, అక్షర్ పటేల్ 17వ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. అల్ రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్య రెండవ ప్లేస్ లో ఉన్నాడు.
ట్రెండింగ్ వార్తలు






















