అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?

TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రాజకీయం మొత్తం నటుడు విజయ్ చుట్టూనే తిరుగుతోంది. ఆయన జోరును అడ్డుకునేందుకు ప్రత్యర్థి పార్టీలు పక్కా వ్యూహంతో మైండ్ గేమ్ ను ముమ్మరం చేశాయి.

Huge mind game is going on around TVK Vijay:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం మొత్తం నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం చుట్టూనే తిరుగుతోంది. విజయ్ నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ఆయన చీల్చే ఓట్లు ఏ పార్టీ కొంపముంచుతాయో అన్న భయం ద్రావిడ దిగ్గజాలను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే విజయ్ రాజకీయ అడుగులను ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు పక్కా వ్యూహంతో మైండ్ గేమ్ ను ముమ్మరం చేశాయి.

వ్యక్తిగత సెగలు.. రాజకీయ చదరంగం

విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన కుటుంబంలో నెలకొన్న విభేదాలు, భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్,  తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో ఉన్న గ్యాప్‌ను రాజకీయ ప్రత్యర్థులు అస్త్రంగా వాడుకుంటున్నారు. ఒకవైపు కుటుంబ సమస్యలు, మరోవైపు సినిమాలకు సంబంధించిన ఐటీ దాడులు, షూటింగ్ అభ్యంతరాలు వంటివన్నీ ఒకేసారి ఆయన మీదకు వస్తున్నాయి. ఇది విజయ్‌ను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. 

ఎన్డీఏ ముద్ర.. వ్యూహాత్మక ప్రచారం

ప్రస్తుతం విజయ్ పార్టీని ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు వాడుతున్న ప్రధాన అస్త్రం  ఎన్డీఏ లింక్. విజయ్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారాన్ని సోషల్ మీడియాలో జోరుగా సాగిస్తున్నారు.  ఆయన ఎన్డీఏ కూటమిలోకి వెళ్తారనే ముద్ర వేయడం ద్వారా మైనారిటీలు,  ద్రావిడ సిద్ధాంతవాదుల ఓట్లను ఆయనకు దూరం చేయాలనేది డీఎంకే వంటి పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ  బీజేపీ టీమ్ ముద్ర పడితే, తమిళనాడులో విజయ్ ఓట్ బ్యాంక్‌కు భారీ గండి పడే ప్రమాదం ఉంది.  విజయ్ బలమైన ముద్ర వేస్తారని సర్వేలు చెబుతున్నా, ఆయన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంటారని ఎవరూ అంచనా వేయడం లేదు. అయితే, ఆయన సాధించే  ఓట్లు అధికార డీఎంకే ఓట్లను చీలుస్తాయా లేక అన్నాడీఎంకేను దెబ్బతీస్తాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. యువతలో ఉన్న క్రేజ్ కారణంగా ఇతర పార్టీల ఓట్ బ్యాంక్‌ను విజయ్ కొల్లగొడితే, అది తమిళనాడులో అనూహ్య ఫలితాలకు దారితీస్తుంది. అందుకే అన్ని పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి విజయ్‌ను టార్గెట్ చేస్తున్నాయని భావిస్తున్నారు. 

బీజేపీతో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం 

విజయ్   ప్రత్యర్థులు చేస్తున్న మైండ్ గేమ్ కు కౌంటర్ ఇవ్వాలంటే, ఆయన తన సిద్ధాంతాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు విషయంపై ఆయన ఇచ్చే క్లారిటీపైనే మైనారిటీల మద్దతు ఆధారపడి ఉంది. అటు సినీ సమస్యలు, ఇటు రాజకీయ ఒత్తిళ్లు.. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న దళపతి, తన  విజయం కోసం ఎలాంటి ప్లాన్ బీ సిద్ధం చేసుకున్నారనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో సినిమా గ్లామర్ రాజకీయ విజయానికి గ్యారెంటీ కాదు. ఎంజీఆర్, జయలలిత వంటి వారు నిరూపించినా, కమల్ హాసన్ వంటి వారు విఫలమయ్యారు. విజయ్ తనపై వస్తున్న  మైండ్ గేమ్  ఆరోపణలను తిప్పికొట్టి, ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకోగలిగితేనే ఆయన పార్టీ రేసులో నిలబడగలదు. లేదంటే ప్రత్యర్థులు అల్లిన  ఎన్డీఏ ముద్రలో చిక్కుకొని ఓట్ల చీలికకే పరిమితం కావాల్సి వస్తుందని తమిళ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget