Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
టీ20 ప్రపంచకప్ ( T20 World Cup ) విజేతగా నిలిచింది భారత్. అయితే ఈ టీమ్ లో తాను లేకపోవడంపై స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ) ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan ) అభిప్రాయపడుతున్నారు. అయ్యర్‌కు అన్యాయంపై జరిగింది అంటూ పఠాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
శ్రేయస్ అయ్యర్ గురించి ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. అతనొక ఒక క్వాలిటీ ప్లేయర్స్ అని అన్నారు. "ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ వరకు తీసుకెళ్లి, 600 పైగా పరుగులు చేసినా అతన్ని వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోకపోవడం బాధాకరం. శుబ్మన్ గిల్ ( Shubman Gill ) కంటే అయ్యర్ ఎక్కువ నిరాశకు గురై ఉంటాడు" అని పఠాన్ పేర్కొన్నారు.
టీమ్ కాంబినేషన్ కారణంగానే అతన్ని పక్కన పెట్టారని సెలెక్టర్లు చెప్పినప్పటికీ, అయ్యర్ లాంటి స్పిన్ అటాకింగ్ బ్యాటర్ టీమ్ లో ఉండాల్సిందని అన్నారు. అయ్యర్ కేవలం ఒక ప్లేయర్ మాత్రమే కాదని, భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉండగల సమర్థుడని పఠాన్ ధీమా వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















