Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
ఎవరైనా 47పరుగుల దగ్గర ఉన్నప్పుడు రిటైర్ అయిపోయమని చెప్తారా మొన్న యూపీ వారియర్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కి జరిగిన మ్యాచ్ లో హర్లీన్ డియోల్ కి టీమ్ కోచ్ అభిషేక్ నాయర్ చెప్పాడు. స్లో స్ట్రైక్ రేట్ గా కారణంగా పరుగులు పెద్దగా రావట్లేదు అంటూ హర్లీన్ డియోల్ కి రిటైర్డ్ ఇచ్చి వచ్చేయమన్నాడు అభిషేక్ నాయర్. 47పరుగుల మీదున్న హర్లీన్ డియోల్ షాకైపోయింది. టీమిండియాకు రెగ్యులర్ ప్లేయరైన తనను ఇలా పిలవటం పాపం అవమానంగా కూడా భావించి ఉంటుంది. ఆ కసినంతా నిన్న ముంబై ఇండియన్స్ పై మ్యాచ్ లో చూపించింది హర్లీన్. వచ్చీ రాగానే మూడు ఫోర్లు బాదింది. ఆతర్వాత ఎక్కడా తగ్గలేదు 39 బాల్స్ లోనే 12ఫోర్లు బాదేసి 64పరుగులతో నాటౌట్ గా నిలవటంతో పాటు యూపీ వారియర్స్ కి ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందించిద హర్లీన్. అలా తనకు ఎదురైన అవమానికి కేవలం ఒక్క రోజు తేడాలోనే సమాధానం చెప్పింది. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ అదంతా తను పెద్దగా మనసుకు తీసుకోలేదని ఆ నిర్ణయం తర్వాత తమ టీమ్ ఓడిపోవటం బాధపెట్టిందని...కానీ ఈరోజు విజయంతో టీమ్ విజయాల బాట పట్టడం సంతోషంగా ఉందంటూ స్పోర్టివ్ గా మాట్లాడింది హర్లీన్ డియోల్.





















