Zimbabwe Coach Warns Team India | టీమిండియాకు జింబాబ్వే కోచ్ వార్నింగ్ | ABP Desam
టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup ) సూపర్-8 క్లైమాక్స్‌కు చేరుకుంది. గురువారం చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఇప్పుడు ఇరు జట్లకు సెమీస్ రేసులో నిలవాలంటే అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే ప్రధాన కోచ్ జస్టిన్ సామన్ టీమిండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
తమ మొదటి సూపర్-8 మ్యాచ్‌ల్లో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో, జింబాబ్వే వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి గెలుపు కోసం కసితో ఉన్నాయి. "భారత్ తమపై ఎంత దూకుడుగా ఆడుతుందో తమకు తెలుసని, అయితే తాము కూడా పక్కా ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నామని" సామన్ హెచ్చరించారు. వెస్టిండీస్ అనుసరించిన అగ్రెసివ్ ఫార్ములానే భారత్ కూడా వాడుతుందని తమకు తెలుసని ఆయన విశ్లేషించారు.
ముంబైతో పోలిస్తే చెన్నై గ్రౌండ్ పెద్దది. ఈ బౌండరీల దూరం మా బౌలర్లకు కలిసి వస్తుంది. భారత బ్యాటర్లను కట్టడి చేయడానికి ఇది మాకు మంచి అవకాశం" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పాకిస్థాన్ వంటి పెద్ద జట్లకే షాక్ ఇచ్చిన చరిత్ర జింబాబ్వేకు ఉంది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.























