అన్వేషించండి

Ind vs Afg Series: భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలిసారి వన్డే సిరీస్.. BCCI అధికారిక షెడ్యూల్ విడుదల

IPL 2026 తర్వాత భారత జట్టు సొంతగడ్డపై జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో చారిత్రాత్మకమైన ఒక టెస్ట్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరగడం ఇదే మొదటిసారి.

టి20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లతో టీమిండియా బిజీగా ఉన్న సమయంలో బీసీసీఐ మరో కొత్త సిరీస్ ప్రకటించింది. భారత క్రికెట్ అభిమానులకు ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2026 తర్వాత జూన్ నెలలో భారత జట్టు తన సొంత గడ్డపై ఒక కొత్త సవాలుకు సిద్ధం కానుంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడబోతోంది. అయితే ఇది సాధారణ సిరీస్ మాత్రం కాదు. ఆ జట్టుకు గుర్తుండిపోయే మెమరీ ఇది. ఇది రెండు దేశాల మధ్య తొలి వన్డే సిరీస్ కావడంతో అఫ్గాన్ జట్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మొదటిసారిగా ద్వైపాక్షిక వన్డే సిరీస్

టీమిండియా ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్‌తో ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్ వంటి పెద్ద వేదికలపై వన్డే మ్యాచ్‌లు ఆడింది.  కానీ 2 దేశాల మధ్య ఇప్పటి వరకు ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ కూడా జరగలేదు. అందుకే జూన్ 2026లో జరగనున్న ఈ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ చరిత్రలో మొదటిసారిగా నమోదు కానుంది.

ఈ పర్యటన ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. చండీగఢ్‌లో జూన్ 6 నుండి జూన్ 10 మధ్య రెండు జట్లు తొలి జట్టులో  తలపడనున్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇది ​​రెండవ టెస్ట్ మ్యాచ్ మాత్రమే. అంతకుముందు రెండు జట్ల మధ్య 2018లో కేవలం ఒకే ఒక టెస్ట్ జరిగింది. 2018లో జరిగిన ఆ టెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. 

జూన్‌లో ప్రారంభం కానున్న వన్డే యాక్షన్

ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత జూన్ 14 నుండి భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చారిత్రాత్మక వన్డే సిరీస్ కూడా జరగనుంది. దీని మొదటి మ్యాచ్ ధర్మశాలలో జరగనుండగా, రెండవ మ్యాచ్ లక్నో వేదికగా, మూడవ మ్యాచ్ చెన్నైలో నిర్వహించనున్నారు. ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటైన భారత్‌తో వారి స్వదేశంలో ఆడే అవకాశం రావడం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు పెద్ద పరీక్షగా మారవచ్చు. కానీ వారికి ఇలాంటి సిరీస్ లు రావడం ఆఫ్గన్ క్రికెట్‌కు మేలు చేస్తుంది.

భారత్-ఆఫ్ఘనిస్తాన్ వన్డే షెడ్యూల్:

  • మొదటి వన్డే మ్యాచ్: 14 జూన్ 2026, ధర్మశాల

  • రెండవ వన్డే మ్యాచ్: 17 జూన్ 2026, లక్నో

  • మూడవ వన్డే మ్యాచ్: 20 జూన్ 2026, చెన్నై

మరోవైపు ఇండియాకు ఈ సిరీస్ 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాల దిశగా మొదటి అడుగుగా భావిస్తున్నారు. స్వదేశంలో కొత్త వ్యూహాలను, ఆటగాళ్లను పరీక్షించడానికి ఇది ఒక మంచి అవకాశం కానుంది. 

సీనియర్ ఆటగాళ్ల కం బ్యాక్.. 

ఈ సిరీస్‌లో భారత జట్టు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తిరిగి జట్టుతో చేరతారు. మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు మళ్లీ మైదానంలో దిగి ఆడనున్నారు. అయితే ఇప్పటి వరకు భారత జట్టును అధికారికంగా ప్రకటించలేదు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత సెలెక్టర్లు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCCI Announces Reward: భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
Sanju Samson and Sachin Tendulkar: సంజూ శామ్సన్ విశ్వరూపం వెనుక ఆ 25 నిమిషాల ఫోన్ కాల్! సచిన్ చెప్పిన మంత్రం ఏంటీ?
సంజూ శామ్సన్ విశ్వరూపం వెనుక ఆ 25 నిమిషాల ఫోన్ కాల్! సచిన్ చెప్పిన మంత్రం ఏంటీ?
Team India : ఒక మ్యాచ్ ఆడినందుకు టీం ఇండియాకు రూ. 3 కోట్లు, పాకిస్తాన్‌కు రూ. 49 లక్షలు మాత్రమే, ఎలాగో తెలుసా?
ఒక మ్యాచ్ ఆడినందుకు టీం ఇండియాకు రూ. 3 కోట్లు, పాకిస్తాన్‌కు రూ. 49 లక్షలు మాత్రమే, ఎలాగో తెలుసా?
Ishan Kishan Family Tragedy: విషాదాన్ని అధిగమించి టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్
విషాదాన్ని అధిగమించి టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Embed widget