అన్వేషించండి

BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్

Kaleshwaram Project | అన్నారం బ్యారేజీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? జరుగుతోందని కేటీఆర్ వీడియో పోస్ట్ చేశారు.

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ విషయంలో జరిగిన వివాదాలు చాలదన్నట్టు, ఇప్పుడు అన్నారం బ్యారేజీని కూడా ప్రమాదంలోకి నెట్టేందుకు కుతంత్రాలు మొదలయ్యాయనే బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, బ్యారేజీ పిల్లర్ల వద్దే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బ్యారేజీకి అత్యంత సమీపంలో ఇలాంటి తవ్వకాలు చేపట్టకూడదనే కనీస నిబంధనలను కూడా పాటించకుండా, ఇసుక మాఫియా సాగిస్తున్న ఈ అరాచకంపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

రాజకీయ కుట్రలు చేస్తోందని అధికార పార్టీపై విమర్శలు

అన్నారం బ్యారేజీని బలహీనపరిచి, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అరాచక పర్వాన్ని సాగిస్తోందని, దీన్ని రైతాంగం ఎన్నటికీ క్షమించదన్నారు. ప్రజలు సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టపగలే నిస్సిగ్గుగా కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా ఈ దందా సాగిస్తోందని, ఇది తెలంగాణ వనరులను నిలువునా కొల్లగొట్టడమేనని మండిపడ్డారు.

ప్రజా పాలనపై విరుచుకుపడుతున్న విపక్షాలు

ప్రస్తుత రేవంత్ సర్కార్ హయాంలో "అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో" అనే సూత్రమే ప్రాతిపదికగా సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. అన్నారం బ్యారేజీకి లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైనా నష్టం జరిగితే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీయే వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకుంటున్న నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి ఈ కుట్రలకు పాల్పడుతున్నట్లు అయితే, త్వరలోనే ప్రజలు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget