Rinku Singh Family Emergency T20 World Cup 2026 | వరల్డ్ కప్ వీడిన రింకూ సింగ్ | ABP Desam
టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) సూపర్-8 దశలో ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓడి ఒత్తిడిలో ఉన్న టీమిండియాకు మరో ఊహించని షాక్ తగిలింది. జట్టులో కీలక ఫినిషర్ అయిన రింకూ సింగ్ ( Rinku Singh ) ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అర్ధాంతరంగా టోర్నీని వీడాడు.
రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రింకూ చెన్నై నుంచి ఆయన తన ఇంటికి బయలుదేరి వెళ్లారు. దీంతో ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆయన పాల్గొనలేదు.
జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ లో రింకూ సింగ్ ఆడే అవకాశం లేదు. అసలే సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో డెత్ ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడే రింకూ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు. రింకూ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ( Axar Patel ) తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో అక్షర్‌ను పక్కన పెట్టడంపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. అక్షర్ రాకతో బౌలింగ్‌లోనూ భారత్‌కు అదనపు బలం చేకూరుతుంది అని అంటున్నారు ఫ్యాన్స్.























